బయటపడ్డ పొన్నాల, జానారెడ్డి విభేదాలు

2 Oct, 2014 13:57 IST|Sakshi
బయటపడ్డ పొన్నాల, జానారెడ్డి విభేదాలు

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత కె. జానారెడ్డి మధ్య అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. రైతుల ఆత్మహత్యల అంశంపై పార్టీ వైఖరి ఎలావుండాలనే దానిపై పొన్నాల, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకరరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.

అన్నదాతల ఆత్మహత్యలపై కేసీఆర్ సర్కారును ఘాటుగా విమర్శించాలని షబ్బీర్, పొంగులేటి సూచించారు. వీరి వాఖ్యలతో పొన్నాల ఏకీభవించారు.ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే అయినందున సంయమనం పాటించాలని జానారెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడాల్సిందేనని పొన్నాల పేర్కొన్నారు. ఇప్పుడే క్షేత్రస్థాయి పోరాటాలు అవసరం లేదని జానా బదులిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాలని షబ్బీర్, పొంగులేటి ప్రతిపాదించారు.

మరిన్ని వార్తలు