స.హ.చట్టం బాగా పనిచేస్తోంది: మాడభూషి

24 Aug, 2018 00:49 IST|Sakshi

హైదరాబాద్‌: దేశంలో సమాచార హక్కు(స.హ)చట్టం సక్రమంగా పనిచేస్తోందని ప్రతీ ఏడాది 60– 70 లక్షల మంది చట్టాన్ని విని యోగించుకుంటున్నారని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ అన్నారు. మీడియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్, యుగాంతర్‌ సంస్థల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. అంతకుముందు యూఆర్‌టీఐ.ఇన్‌ వెబ్‌ సైట్‌ను ఆవిష్కరించారు. వ్యవస్థల పనితీరు, అందులోని లోటుపాట్లు ప్రశ్నించేందుకు ఆర్టీఐను ఉపయోగించుకోవాలన్నారు.

ఒక పత్రికలో వార్తను చూసి వంద ఆర్టీఐలు వేయవచ్చన్నారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రానికి ఉం దని, కాని కమిషనర్‌కు జీతం అంశా న్ని మాత్రం కేంద్రం నిర్ణయిస్తుందని తెలిపారు. అయితే దీన్ని ఏ రాష్ట్రం ప్రశ్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ సంస్థలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలుండాలని, జాతీయ మహిళా కమిషన్‌లో ఆ కమిటీ ఉందా? అని ప్రశ్నించారు.

ఐజేయూ ప్రధాన కార్యదర్శి, మీడియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు శిక్షణ, పరిశోధనకు ఒక సంస్థ ఉండాలనే దీన్ని ఏర్పాటు చేశా మని త్వరలోనే మరికొన్ని కోర్సుల్ని ప్రారం భించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెబ్‌సైట్‌ నిర్వాహకుడు సుశీల్, యుగాంతర్‌ డైరెక్టర్‌ శశికుమార్, సీనియర్‌ జర్నలిస్టు శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు