నగరంలో తిరిగే హక్కు లేదా..?

29 Dec, 2019 07:21 IST|Sakshi

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌): నిజామాబాద్‌ ఎంపీగా నగరంలోని మైనారిటీ ఏరియాలో తిరిగే హక్కు తనకు లేదా అని ఎంపీ అరి్వంద్‌ ప్రశ్నించారు. వార్డుల తనిఖీకి వెళ్తానంటే పోలీసులు వద్దంటున్నారని శనివారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. అభివృద్ధి పనులు చేపట్టకుండా టీఆర్‌ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లు నిధులు మింగేశారని ఆరోపించారు. కమ్యూనిటీ మీటింగ్‌ పెడితే ఓవైసీకి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు తిరిగే పరిస్థితి లేదని, ఇది హిందుస్తానా..? పాకిస్తానా..? అన్నారు. మైనారిటీ ఏరియాలో అభ్య ర్థులను నిలబెట్టి ప్రచారం చేస్తామని, అన్ని మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన అసదుద్దీన్‌ సభ కు టీఆర్‌ఎస్‌ శ్రేణులను భారీగా తరలించారని అరి్వంద్‌ పేర్కొన్నారు. సభకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భయపడి వెళ్లేలేదని, అయినప్పటికీ కార్యకర్తలను తరలించారని విమర్శించారు. జిల్లాలో షకీల్‌ తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా సభకు హాజరుకాలేదని, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పినా ఎమ్మెల్యేలు విని్పంచుకోలేదన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, నాయకులు సూర్యనారాయణ గుప్త, బస్వా లక్ష్మీనర్సయ్య, గీతారెడ్డి, ఎల్లప్ప, వెంకటేశం, యెండల సుధాకర్, న్యాలం రాజు, మల్లేష్‌ యాదవ్, బద్దం కిషన్, స్వామి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.      

మరిన్ని వార్తలు