ప్రగతి నివేదన సభకు వెళ్తూ మృత్యుఒడిలోకి..

3 Sep, 2018 10:47 IST|Sakshi
అబ్దుల్‌ రహీం (ఫైల్‌)

శాలిగౌరారం(నకిరేకల్‌) : రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ఆదివారం జరిగిన టీఆ ర్‌ఎస్‌ ప్రగతి నివేదన బహిరంగ సభకు జనంతో కలిసి వెళ్తున్న శాలిగౌరారం మండలం మాధారంకలాన్‌ గ్రామానికి చెందిన సయ్యద్‌ అబ్దుల్‌రహీం(31)  డీసీ ఎం వాహనం పైనుంచి పడి మృతి చెం దాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద జరిగింది. వివరాలు.. మాధారంకలాన్‌కు చెందిన డీసీ ఎం వాహనం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను బహిరంగ సభకు తరలించే క్రమంలో వేగంగా వెళ్తూ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో  ప్రమాదం జరిగి నట్లు అదే వాహనంలో ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తెలిపారు.

అతి నిరుపేద కుటుంబం
గ్రామానికి చెందిన అబ్దుల్‌ రహీంది గ్రామంలోకెల్లా అతినిరుపేద కుటుం బం. దినసరి కూలీ. గ్రామంలో ఎలాంటి స్థిరాస్తులు, సొంత ఇల్లు కూడా లేదు. అబ్దుల్‌రహీం తండ్రి గూడుసాబ్‌ ఏడేళ్ల క్రితం మృతిచెందగా.. తల్లి సైదాబీ సంవత్సరం క్రితం మరణించింది. తల్లి ప్రథమ వర్థంతిని కూడా ఇటీవలే నిర్వహించాడు. అబ్దుల్‌రహీంకు ఒక తమ్ముడు ఉన్నాడు. తల్లిదండ్రుల మరణాంతరం అతను కూడా ఇల్లు వదిలి హైదరాబాద్‌లో కారు డ్రైవింగ్‌ చేస్తూ బతుకుతున్నాడు. ఈ క్రమంలో మాధారంకలాన్‌లో ఒంటరిగా తన పూరిగుడిసెలో ఉంటున్న అబ్దుల్‌రహీం దినసరి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. గ్రామంలో సొంత ఇల్లుకూడా లేని అబ్దుల్‌రహీంకు డబుల్‌బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పి టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రగతి నివేదన బహిరంగ సభకు తీసుకుపోయారని గ్రామస్తులు తెలిపారు. అబ్దుల్‌ రహీం అవివాహితుడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు