బైక్‌ను ఢీకొట్టిన బొలేరో.. వ్యక్తి మృతి

14 Apr, 2017 09:30 IST|Sakshi
రాయపర్తి(వరంగల్‌ రూరల్‌):  ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వేగంగా వెళ్తున్న బొలేరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న కుమారస్వామి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
 
ఈ సంఘటన రాయపర్తి శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
మరిన్ని వార్తలు