ప్రమాదం.. ఆగ్రహం

19 Aug, 2019 10:49 IST|Sakshi
రాస్తారోకో చేస్తున్న రెడ్డిపల్లి వాసులు,  లాలయ్య మృతదేహం 

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మృతదేహంతో జాతీయ  రహదారిపై గ్రామస్తుల రాస్తారోకో

రోడ్డుపై నిలిచినవాహనాలు

సాక్షి, చేగుంట(తూప్రాన్‌): గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చేగుంట శివారులోని రెడ్డిపల్లి బైపాస్‌ చౌరస్తా వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కర్రెపల్లి లాలం (60) (లాలయ్య) రెడ్డిపల్లి నుంచి సైకిల్‌పై వస్తున్నాడు. రెడ్డిపల్లి రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన లాలయ్యను వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ప్రమాద విషయం తెలుసుకున్న లాలం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశారు. గ్రామస్తులు పలువురు ఇదే తరహాలో మృతి చెందుతున్నారని ఆగ్రహించి రోడ్డుపైనే బైఠాయించారు. బైపాస్‌ చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ట్రాఫిక్‌లో ఎమ్మెల్యే బాజిరెడ్డి..
గ్రామస్తులు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు వారిని సముదాయించారు. అయినా వినకుండా ప్రమాదాలు జరగకుండా బ్రిడ్జి ఎందుకు నిర్మించలేదో అధికారులు తెలిపే వరకు రాస్తారోకో విరమించేది లేదని పట్టుబట్టి కూర్చున్నారు. ఒంటి గంట నుంచి దాదాపు 3 గంటల వరకు రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. బస్సుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించకూడదని పోలీసులు సముదాయించినా గ్రామస్తులు వినలేదు. టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు వెంగళ్‌రావుతో పాటు పలువురు గ్రామ నాయకులు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు. బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ, ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకోగా రాస్తారోకో విరమించిన అనంతరం వెళ్లిపోయారు. ఈ మేరకు కేసు నమోదుచేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. లాలయ్యను ఢీకొట్టిన వాహనం కోసం విచారణ జరుపుతున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంట్లో చొరబడి కత్తితో బెదిరించి..

ఆటకు రూ.500!

రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీ ఉద్యోగి మృతి

‘ఫ్యాన్సీ’ గా అక్రమ సిగరెట్ల వ్యాపారం

టూరిస్ట్‌ వీసాలపై గల్ఫ్‌ దేశాలకు..

టీడీపీ నాయకులపై కేసు నమోదు

ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు : షాకింగ్‌ వీడియో

‘నా తల్లిదండ్రులే వ్యభిచారం చేయిస్తున్నారు’

ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది దుర్మరణం

మంత్రి కాన్వాయ్‌ ఢీకొందని తప్పుడు పోస్టు

పర స్త్రీ వ్యామోహంలో.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు

దడపుట్టిస్తున్న హ్యాండ్‌గన్స్‌

ఎంపీపీపై దాడి.. వ్యక్తిపై కేసు నమోదు

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

నటుడు ఫిర్యాదు చేయడంతో.. వంచకుడు అరెస్టు

మహిళా పోలీసుస్టేషన్‌లో లాకప్‌ డెత్‌..?

వివాహమై పదేళ్లవుతున్నా..

ఆర్టీసీ బస్సును ఢీకొన్న దివాకర్‌ బస్సు

సోషల్‌ మీడియాలో ఆర్కేకు బెదిరింపులు

పెళ్లిలో పేలిన మానవబాంబు

ముక్కలుగా నరికి.. డ్రమ్ముల్లో కుక్కి  

మహిళా అధికారికి బెదిరింపులు: ఇద్దరు అరెస్ట్‌

తిరుత్తణి హత్య కేసు: నిందితుడు అరెస్ట్‌

తండ్రిని ముక్కలుగా కోసి.. బకెట్‌లో వేసి..

తండ్రీకూతుళ్లను కలిపిన గూగుల్‌

వీడు మామూలోడు కాడు : వైరల్‌

చినబాబు అరెస్ట్‌, జ్యోతికి బ్లూ కార్నర్‌ నోటీస్‌!

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం

నా నంబర్‌ వాళ్ల దగ్గర లేదనుకుంటా

దెయ్యాల  కథలు  చెబుతా

ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలి – కృష్ణంరాజు

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక