శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌పై ప్రమాదం

6 Jul, 2018 09:14 IST|Sakshi

ఐదుగురికి తీవ్రగాయాలు

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొకటి వరుసగా ఆరు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దీంతో ట్రాఫిక్‌ను తొలగించడానికి ఎయిర్‌పోర్ట్ నిర్వాహక సంస్థ జీఎంఆర్‌ రికవరీ వ్యాన్‌తో రంగంలోకి దిగింది.  సంఘటనా స్థలానికి చేరుకుంటుండగా దాని వెనుకనే వచ్చిన మరో కారు, వ్యాన్‌ను ఢీ కొట్టడంతో డ్రైవర్‌కు యాదగిరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా