కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

28 Jun, 2019 21:11 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నుస్తులాపూర్‌లో రోడ్డు దాటుతున్న బైక్‌ను, కారు ఢీ కొట్టింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు చాలా దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతున్ని నుస్తులాపూర్‌కు చెందిన ఆవుల రవిగా గుర్తించారు. గాయపడ్డ సమ్మయ్యను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో చూస్తే ప్రమాదం ఎంత భయనకంగా జరిగిందో అర్థమవుతుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు