పాయసంలో మత్తు మందు కలిపి దోపిడీ

13 Feb, 2015 12:10 IST|Sakshi

ఖిలా వరంగల్: పెళ్లి రోజు వేడుకలని చెప్పి ఇంటి యజమానికి మత్తు మందు కలిపిన పాయసం ఇచ్చి నిలువు దోపిడీ చేసిన సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. స్తానికి ఖిలా వరంగల్ లో దాసరి కలావతి(65), కొమరయ్య(67) దంపతులు నివాసం ఉంటున్నారు. కాగా 20 రోజుల క్రితం ఓ జంట వారి ఇంట్లో అద్దెకు దిగారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆ జంట తమ పెళ్లి వేడుక అని చెప్పి వృద్ధ దంపతులకు మత్తు మందు కలిపిన పాయసాన్ని ఇచ్చారు.  పాయసం తాగిన వారు మత్తులో పడిపోయారు. 

అనంతరం వారిని కొట్టి ఇంట్లో ఉన్న 7 తులాల బంగారం,  నగదు, కలర్ టీవీని అపహరించుకుపోయారు. వృద్ధ దంపతుల పరిస్థితి విషయంగా ఉండటంతో స్థానికులు వారిని ఎమ్‌జీఎమ్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ చోరికి సంబంధించి వివరాలు  తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దంపతులు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు చేపడతామన్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు