పట్టపగలే తాళాలు బద్దలు కొట్టి చోరీ

18 Apr, 2016 17:29 IST|Sakshi

ధర్మారం (కరీంనగర్ జిల్లా) :  ధర్మారం మండల కేంద్రం శివారులో దొంగలు పట్టపగలే ఓ ఇంట్లో చోరీ చేశారు. గోనె మధుసూదన్ తన భార్యతో కలసి సోమవారం మధ్యాహ్నం సమీపంలోని రాయపట్నం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి రాగా ఇంటి తాళాలు పగులగొట్టి లోపల బీరువాలో వస్తువులు చిందరవందరగా కనిపించాయి. సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు చోరీకి గురైనట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

మరిన్ని వార్తలు