కొండమల్లేపల్లిలో భారీ చోరీ

14 Sep, 2015 11:49 IST|Sakshi

నల్లగొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో భారీ చోరీ జరిగింది. స్తానికంగా ఉండే ఆటోమొబ్‌ల్ వ్యాపారి ఏతా రాము ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న 70 తులాల బంగారం, రూ. 50 వేల నగదును దుండగులు దోచుకెళ్లారు. ఆదివారం హైదరాబాద్ వెళ్లిన రాము సోమవారం ఉదయం రాగా తలుపులు పగలగొట్టి ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు