బొమ్మలొద్దిగుట్టపై ప్రాచీన చిత్రాలు

8 Mar, 2018 02:02 IST|Sakshi

ఆదిమానవులు వేసిన రాక్‌ పెయింటింగ్‌ వెలుగులోకి  

ఎస్‌ఎస్‌తాడ్వాయి(ములుగు): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం నర్సాపూర్‌ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బొమ్మలొద్దిగుట్టపై ఆదిమానవులు వేసిన చిత్రాలు బుధవారం వెలుగు చూశాయి. జిల్లా ఎకో టూరిజం కోఆర్డినేటర్‌ సుమన్‌ స్థానికుల సాయంతో గుట్టలను సందర్శించి వీటిని గుర్తించారు.

బొమ్మలొద్దిగా వ్యవహరించే ఈ కొండల్లో ఆదిమానవులు ఎరువు, తెలుపు రంగుల్లో చిత్రించిన రెండు చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. ఇవి ఇదే మండలంలోని రాక్షసులగుట్టల్లో ఉన్న మెగాలితిక్‌ సమాధులకు చాలా దగ్గరగా ఉన్నట్లు సుమన్‌ వెల్లడించారు.

జయశంకర్‌ జిల్లాలో రాక్‌ పెయింటింగ్‌ ఉన్న మూడో ప్రాంతంగా బొమ్మలొద్ది గుట్టను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ గుట్టపై నీటి కొలనులు కూడా ఉన్నాయి. పురావస్తు శాఖ అధికారులు వీటిపై మరింత పరిశోధన చేసి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు