ఆర్యవైశ్యులు అన్ని విధాలా ఎదగాలి: రోశయ్య

11 Jun, 2018 00:44 IST|Sakshi

హైదరాబాద్‌: ఆర్యవైశ్యులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య అన్నారు. ఆదివారం నాగోలులో నిర్వహించిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర శాఖ, మహిళా విభాగం, యూత్‌ విభాగాల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్యవైశ్యులు క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు.

ఉమ్మడి ఏపీలో ఉన్న సంఘం తెలంగాణలో కూడా శాఖను ఏర్పాటు చేసి సభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలు కూడా ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈబీసీ వర్గాల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీతో ప్రమాణస్వీకారం చేయించారు.

కార్యవర్గం ఇదే..: ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పాండుగుప్త, ప్రధాన కార్యదర్శిగా విశ్వేశ్వరయ్యగుప్త, కోశాధికారిగా నాగభూషణం, ఉపాధ్యక్షుడిగా కృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా స్వరూపరాణి, ప్రధాన కార్యదర్శిగా రోజారమణి, కోశాధికారిగా శాంతి, హైదరాబాద్‌ అధ్యక్షురాలిగా యాద మంజుల, యూత్‌ వింగ్‌ అధ్యక్షుడిగా సంపత్, సెక్రెటరీగా సందీప్, కోశాధికారిగా ఆకాశ్‌ తదితరులను ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు