ఆ కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలి

21 Oct, 2017 05:47 IST|Sakshi

వీవర్స్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో మరణించిన చేనేత కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వీవర్స్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ డిమాండ్‌ చేసింది. కులవృత్తిపై ఆధారపడ్డ చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారికి చేయూత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వీవర్స్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు సురేష్‌ దాసు, సలహాదారులు కుంటాల గంగాధర్‌ తిలక్, ఊర్మిళ, శ్రీనివాస్‌ తదితరులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 58 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయని, కానీ ఈ సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల వివరాలను తేల్చాలని, అనంతరం వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు