రూ.10.50 లక్షలు పలికిన బెల్ట్‌షాప్‌

6 Oct, 2017 04:53 IST|Sakshi

వేల్పూర్‌: నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం పడగల్‌లో బెల్ట్‌షాప్‌నకు గ్రామాభివృద్ధి కమిటీ నిర్వహించిన వేలంలో రూ. 10.50 లక్షలు ధర పలికింది. గ్రామంలో గతంలో ప్రభుత్వ అనుమతితో మద్యం దుకాణాన్ని నిర్వహించేవారు. అయితే, గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)కి డబ్బులు చెల్లించాల్సి రావడంతో వ్యాపారులు ఇక్కడి షాపునకు టెండర్లు వేయడం మానేశారు. దాంతో ప్రభుత్వం కూడా అక్కడ మద్యం దుకాణం ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించలేదు.

మేజర్‌ గ్రామం కావడంతో మద్యం అమ్మకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీంతో వీడీసీ కొన్నేళ్లుగా ఏటా దసరా తర్వాత కొత్తగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి వేలం నిర్వహిస్తోంది. ఈసారి అలాగే వేలం వేయగా, ఓ వ్యాపారి రూ.10.50 లక్షలకు దక్కించుకున్నట్లు తెలిసింది. గతేడాది వ్యాపారులు సుమారు రూ.16 లక్షల వరకు పాడారు. బెల్టు షాప్‌ దక్కించుకున్న వారు ఎమ్మార్పీపై అదనంగా రూ.10 చొప్పున అమ్మాలని నిర్ణయించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు