పేదింటికి రూ.3,100 కోట్లు

14 Aug, 2014 03:04 IST|Sakshi

ఆర్థిక మంత్రికి గృహనిర్మాణ శాఖ ప్రతిపాదనలు
 సాక్షి, హైదరాబాద్: నిరుపేదలకు రెండు పడక గదులతో ఇళ్లను నిర్మించి ఇచ్చే గృహనిర్మాణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌లో తమకు రూ.3100 కోట్లను కేటాయించాలని గృహ నిర్మాణశాఖ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిర్వహించిన సన్నాహక సమావేశంలో గృహ నిర్మాణశాఖ పక్షాన ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్యతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ అంచనాలతో రూపొందించిన ప్రతిపాదనలను అందజేశారు. గతంలో ప్రారంభించి అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్లను (నిర్మాణదశలో ఉన్నవి) కొనసాగించేందుకు రూ.1650 కోట్లు, కేసీఆర్ ఎన్నికల హామీలో పేర్కొన్న రెండు పడకగదుల ఇళ్ల కోసం రూ.1450 కోట్లను కేటాయించాల్సిందిగా ఇందులో కోరారు.

మరిన్ని వార్తలు