ఆలయాల నిర్మాణానికి రూ. 50 కోట్లు

5 Sep, 2018 02:36 IST|Sakshi

కామన్‌ గుడ్‌ ఫండ్‌పై దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: బలహీనవర్గాల కాలనీల్లో నిర్మిం చే ఆలయాలకు రూ.10 లక్షల వరకు మ్యాచింగ్‌ కాంట్రిబ్యూషన్‌ లేకుండానే కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) నిధులు మంజూరు చేయనున్నట్లు దేవా దాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆ శాఖ అధికారులు, సీజీఎఫ్‌ కమిటీ సభ్యులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సీజీఎఫ్‌ ద్వారా చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరిం గ్‌ అధికారులకు సీజీఎఫ్‌ పనులు అప్పగించిన చోట సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తయ్యేలా చూ డాలని సూచించారు. 165 నూతన ఆలయాల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు సీజీఎఫ్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ధూప దీప నైవేద్య పథకం ద్వారా అర్చకులకు గౌరవ వేతనం చెల్లించేందుకు రూ.27 కోట్లను కమిటీ మంజూరు చేసినట్లు వెల్లడించారు. వేదపాఠశాల నిర్వహణకు ఏడాదికి రూ. కోటి కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. సమావేశంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, సీజీఎఫ్‌ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.  

ఉద్యోగులు మరింత బాధ్యతగా పని చేయాలి
ప్రభుత్వం అర్చకుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెంపు, ప్రభుత్వ ఖజానా ద్వారా వేతనాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అర్చక, ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం సచివాలయంలో మంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ  ఉద్యోగులు మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు