రాంనగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు రూ.82.40 లక్షలు

11 May, 2017 00:05 IST|Sakshi
అధికారులతో చర్చిస్తున్న కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి

విడుదల చేసిన జలమండలి
వెల్లడించిన కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి
అధికారులతో సమీక్షా సమావేశం
సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు


ముషీరాబాద్‌: రాంనగర్‌ డివిజన్‌లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు జలమండలి రూ.82.40 లక్షల నిధులు విడుదల చేసిందని కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై చిలకలగూడ వాటర్‌వర్క్స్‌ డీజీఎం శ్రీధర్‌రెడ్డి, మేనేజర్‌ హకీం హుస్సేన్, శ్రీనివాస్‌లతో కార్పొరేటర్‌ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్‌లోని 10 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ తీసుకుబోయే చర్యలు, ఖర్చు చేయనున్న నిధుల వివరాలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు