ప్రమాదాల నీడలో  ఆర్టీసీ ప్రయాణం

16 Nov, 2019 07:55 IST|Sakshi
కరీంనగర్‌ జిల్లా ఇరుకుల్ల వద్ద ప్రమాదానికి గురైన బస్సు

నిత్యం ఏదోచోట ప్రమాదం

తాజాగా లారీని ఢీకొన్న‘రాజధాని’

 డ్రైవర్లకు అవగాహన లేకనా..?

 బస్సులకు ఫిట్‌నెస్‌ కొరవడా..?

సాక్షి, మంచిర్యాల : ఆర్టీసీ బస్సులను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తరుచూ జరుగుతున్న ప్రమాదాలతో ప్రయాణికులను కలవరానికి గురిచేస్తోంది. ఆర్టీసీలో 42 రోజులుగా సమ్మె కొనసాగుతుండటం.. అంతంతగానే త నిఖీలు, మరమ్మతు చేయకుండానే.. సా మర్థ్యాన్ని పరీక్షించకుండానే బస్సులు రోడెక్కడంతో గాడి తప్పుతున్నాయి. డిపో అధికారి మినహయిస్తే అన్ని విభా గాల కార్మికులు సమ్మెలోకి వెళ్లటంతో గ్యారేజీల్లో మరమ్మతు నామమాత్రంగా మారాయి. పదిమందిలోపు తాత్కాలిక సిబ్బందితో బస్సుల  మరమ్మతు చేయిస్తున్నా.. అవగాహనన లేమితో అధ్వానంగా మారుతోంది. ఎంతో అనుభవం ఉన్న ప్రత్యేక నిపుణులు తప్ప.. ఆర్టీసీ బస్సుల సామర్థ్యాన్ని గాడిలో పెట్టడం సాధ్యంకాదు. మరోవైపు సరైనా మరమ్మతుల్లేక అక్కడక్కడా బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. మంచిర్యాల డిపోకు చెందిన బస్సు గజ్వేల్‌లో ముందు భాగం నుజ్జునుజ్జయిన ఘటన మరవకముందే తాజాగా కరీంనగర్‌లో బస్సురోడ్డు ప్రమాదానికి గురికావటం.. పలువురికి గాయాలు కావటం ఆందోళన కల్గిస్తోంది.  

బస్సులకు మరమ్మతులేవి..?
ప్రతిరోజు బస్సు ప్రత్యేకంగా గ్యారేజీలో బస్సుల మరమ్మతు చేస్తుంటారు. విధిగా బస్సులకు మరమ్మతు, చెకప్‌లు పూర్తి చేస్తారు. 350 కిలోమీటర్లు తిరిగిన బస్సుకు ఇది తప్పనిసరి. పొద్దున బయల్దేరిన బస్సుకు సాయంత్రం.. నైట్‌హాల్ట్‌ పోయిన బస్సుకు పగలు మరమ్మతు చేస్తుంటారు. ఏదైనా పెద్ద సమస్య తలెత్తితే పూర్తిచేసిన తర్వాతే బస్సును రోడ్డుపై తిప్పుతారు. జిల్లాలో 141 బస్సుల్లో 50 బస్సులు అద్దెవి కాగా 91 బస్సులు ఆర్టీసీ సంస్థ బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. డిపోలో 557 మంది ఉద్యోగులు, కార్మికులుండగా సమ్మె కారణంగా 549 మంది వి«ధులకు దూరంగా ఉంటున్నారు. ఒక డిపో మేనేజర్, ఏడుగురు సెక్యూరిటీ గార్డులతో  ఇతరత్రా డిపార్ట్‌మెంట్‌ అధికారులను తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నారు. 76 మంది గ్యారేజ్‌ కార్మికులు విధులు నిర్వర్తించాల్సిన చోట పదిమందిలోపు మెకానిక్, సహాయకులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. దీంతో బస్సు మరమ్మతు, చెకప్‌లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని తెలుస్తోంది. 
 

బస్సుకు ఏమేమి పరీక్షలు చేయాలంటే..?
ఆర్టీసీ బస్సు సామర్థ్యం సవ్యంగా కొనసాగాలంటే కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. బస్సుల టైర్లు, ఇంజిన్‌ కండీషన్, డీజిల్‌ ట్యాంకు, బ్రేక్‌ ఆయిల్, ప్రధానమైన అంశాలుగా కండీషన్‌ను సరిచేసుకోవాలి. టైర్లు పనితీరు, డ్రమ్స్‌ ఎలా పనిచేస్తున్నాయో ఒకటికి రెండుసార్లు చూడాలి. గ్రీజింగ్‌ సవ్యంగా ఉందోలేదో పూర్తిస్థాయిలో పరీక్షించుకుని లోపాలు సరిచేసుకోవాలి. ఇంజిన్‌ ఆయిల్‌ మార్చటం, బ్రేక్‌ ఆయిల్‌ ఫిల్టర్‌ను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇదంతా సజావుగా సాగినప్పుడే బస్సులను రోడ్డు మీదకు తీసుకొచ్చే అవకాశాలుంటాయి. ఆర్టీసీ బస్సుల కండీషన్‌ పరీక్షించి రోజులు  గడిచిపోతున్నాయి. వారంలో అన్ని దశల్లో బస్సుల మరమ్మతు పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలి.

అలా చేయకపోవటంతో బ్రేక్‌లు పనిచేయకపోవటం, గమనంలో ఉన్న బస్సు అదుపుతప్పటం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. గేర్‌బాక్స్‌ ఇరుక్కుపోవటం వంటి ప్రమాదాలు తప్పవు. ఇంకోవైపు ప్రస్తుతం మరమ్మతు చేయిస్తున్న తాత్కాలిక సిబ్బంది తమకు వచ్చిన మెకానిజం చేయటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న హైడ్రాలిక్‌పవర్‌ స్టీరింగ్‌ బస్సులకు సంబంధించిన విడిభాగాలు అందుబాటులో లేకపోవటంతో నానాతంటాలు పడుతూ తాత్కాలిక కార్మికులు బస్సులను రోడ్డుపైకి అనుమతి ఇస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్‌ల చేతిలో బస్సుల క్లచ్‌లు, గేర్‌లు ఎక్కువగా చెడిపోతున్నాయని తెలుస్తోంది. దీంతో బస్సు వేగం తగ్గిపోతోందనే అభిప్రాయాలున్నాయి. 

ఘటనలు ఇవిగో..
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ వద్ద బస్సు డివైడర్‌ను ఢీకొట్టిన సంఘటనలో ముందు భాగం నుంచి కండక్టర్‌ సీటు వరకు పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటనలో ఒక ప్రయాణికుడికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌–మంచిర్యాల నడిచే బస్సు కూడా గేర్‌ బాక్స్‌ ఫెయిల్‌ అయి అక్కడి నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ డిపోలోనే బస్సులు ఉంచాల్సి వచ్చింది. ఈనెల 14న రాత్రి మంచిర్యాల–బెల్లంపల్లి ప్రధాన రహదారిపై శ్రీనివాసగార్డెన్‌ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంకోవైపు డ్రైవర్‌ తప్పిదాలతో 17 బస్సుల అద్దాలు (సైడ్‌గ్యాస్‌లు) పగిలిపోయాయి. తాజాగా మంచిర్యాల నుంచి బయల్దేరిన ‘రాజధాని’ బస్సు కరీంనగర్‌ జిల్లా నీరుకుల్ల వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. వెనుకాలే వస్తున్న మరో లారీ ఈ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఇలా ఏదోచోట బస్సులు ప్రమాదాలకు గురికావటంతో పూడ్చుకోలేని నష్టం ఆర్టీíసీ సంస్థకు వాటిల్లుతోంది.

  

మరిన్ని వార్తలు