జేఏసీ నిర్ణయంతో ఆర్టీసీ డ్రైవర్‌ బాబు అంత్యక్రియలు

1 Nov, 2019 14:42 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ఆర్టీసీ డ్రైవర్‌ బాబు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బాబు కుటుంబ సభ్యుల అనుమతితోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఈ క్రమంలో కరీంనగర్‌ బస్‌ డిపో వరకు శవయాత్ర నిర్వహించి తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా 28 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా.. మూడు రోజులుగా బాబు మృతదేహంతో దీక్ష చేసినా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని టీఎంయూ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ థామస్‌ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ యావత్‌ సమాజం, ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారస్తులు మద్దతు తెలిపిన కేసీఆర్‌లో మార్పు రాలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఖరి వల్ల కార్మికులంతా ఆవేదనకు లోనై ఆత్మహత్య, మానసికంగా, చనిపోతున్నారని ధామస్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్‌ బాబు కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం, డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు, ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికులెవరు ఆత్మహత్య చేసుకోవద్దని, సీఎంకు ఆ పరిస్థితులు తీసుకొచ్చేవరకు ఊరుకునేదిలేదని అన్నారు. 

చదవండి : ఆర్టీసీ డ్రైవర్‌ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

మరిన్ని వార్తలు