దేవరకొండలో ఉద్రిక్తత

5 Nov, 2019 08:19 IST|Sakshi
పోలీస్‌ ఎస్కార్ట్‌తో మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్న బంధువులు

కొండమల్లేపల్లి (దేవరకొండ) : గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతిచెందడంతో సోమవారం దేవరకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. డ్రైవర్‌ మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు డి పో ఎదుట ఆందోళన చేపట్టి మృతుడి కుటుం బానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వీరికి అఖిలపక్ష పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పట్టణంలోని దుకా ణాలను మూసి వేయించారు. 

ధర్నాలో పాల్గొంటూనే..
నాంపల్లి మండలం పగిడిపల్లి గ్రామానికి చెంది న తుమ్మలపల్లి జైపాల్‌రెడ్డి (టి.జె.రెడ్డి) (57) దేవరకొండ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జైపాల్‌రెడ్డి తన కుటుంబ ంతో హైదరాబాద్‌లోని ఓంకార్‌నగర్‌లో నివాసముంటూ విధులకు హాజరవుతున్నాడు. అయితే తమ డిమాండ్లను నెరవేర్చాలని నెలరోజులుగా చేస్తున్న సమ్మెలో పాల్గొంటున్నాడు. ఆదివారం ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నాడు. రాత్రి జైపాల్‌రెడ్డి తమ స్వగ్రామమైన నాంపల్లి మండలం పగిడిపల్లి గ్రామానికి వెళ్లాడు. తెల్లవారు జామున  అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బంధువులు తొలుత దేవరకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించా రు.పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృ తిచెందాడు. మృతుడికి భార్య,కుమారుడు ఉన్నారు.

డిపో ఎదుట ఆందోళన
జైపాల్‌రెడ్డి మృతి విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు, మృతుడి కుటుంబ సభ్యులు దేవరకొండకు చేరుకున్నారు. మృతదేహాన్ని దేవరకొండ డిపో ఎదుట ఉంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నిరంకుశంగా వ్యవహరిస్తుండడంతో జైపాల్‌రెడ్డి మనస్తాపానికి గురై హఠాన్మరణం చెందాడని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. ఇకనైనా ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాత్రి దేవరకొండ డిపో ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి జైపాల్‌రెడ్డికి నివాళులర్పించారు. 

నివాళులర్పించిన అఖిలపక్ష నాయకులు
డ్రైవర్‌ మృతివిషయం తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలూ నా యక్, సీపీఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారె డ్డి, బీజేపీ నాయకులు బెజవాడ శేఖర్, సీపీఎం నాయకులు నల్లా వెంకటయ్య, వివిధ పార్టీలు , ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జేఏసీ నాయకులు డిపో వద్దకు చేరుకున్నారు. జైపాల్‌రెడ్డి మృతదేహంపై పూలమాలలు ఉంచి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోం దని ధ్వజమెత్తారు.తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

మృతదేహం హైదరాబాద్‌కు తరలింపు
మృతదేహాన్ని పోలీసులు, బంధువులు హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధం కాగా అఖిలపక్ష పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగి కొద్దిసేపు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ఓంకార్‌ నగర్‌లో నివాసముంటున్నాడు. దీంతో అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని హైదరాబాద్‌ తరలించారు.

డిపోకే పరిమితమైన బస్సులు
తెల్లవారుజామునే జైపాల్‌రెడ్డి మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట బైఠాయించారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.పలువురు తాత్కాలిక విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డిపో వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అఖిలపక్ష నాయకులు, ఆర్టీసి జేఏసీ నాయకులు దేవరకొండ పట్టణ బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యాసంస్థలు, దుకాణాలను మూసివేయించారు. ఎలాం టి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి ఆధ్వర్యంలో సబ్‌డివిజన్‌ పరిధితో పాటు జిల్లా నుంచి పోలీసులు భారీగా దేవరకొండ బస్‌ డిపో ఎదుట మోహరించారు. 11గంటల సమయంలో పోలీస్‌ ఎస్కార్ట్‌ మధ్య ప్రభుత్వ అంబులెన్స్‌లో జైపాల్‌రెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా