ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు

8 Nov, 2019 02:31 IST|Sakshi

ఆస్పత్రిలో చికిత్స  

వర్ధన్నపేట: ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో తీవ్ర మానసిక ఒత్తిడి గురైన ఓ ఆర్టీసీ డ్రైవర్‌ గుండె పోటుకు గురయ్యాడు. ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీకటి వీరస్వామి తొర్రూరు డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెలాఖరున ఆయన రిటైర్మెంట్‌ ఉంది. ఈ క్రమంలో సమ్మె కొనసాగుతుండటంతో తాను ఒక్కడినే విధుల్లో చేరాలా.. వద్దా అని నిర్ణయించుకోలేక మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. విధుల్లో చేరకపోతే రావాల్సిన డబ్బులు వస్తాయో రావో అని ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హన్మకొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. 

ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం 
మేడ్చల్‌: నగరంలోని రాణిగంజ్‌ డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్న ఆర్టీసీ కారి్మకుడు గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశాడు. మండలంలోని డబీల్‌పూర్‌ గ్రామానికి చెందిన షేక్‌బాబా రాణిగంజ్‌ ఆర్టీసీ డిపోలో మెకా నిక్‌గా పని చేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మె ఎటూ తేలకపోవడంతో మనస్తాపం చెందిన షేక్‌బాబా ఇంట్లో ఉన్న గుళికల్ని కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగా డు. షేక్‌బాబాను గమనించిన కుటుంబ సభ్యులు  అతడిని చికిత్స కోసం నగర శివార్లలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.

మరిన్ని వార్తలు