కేసీఆర్‌ గారూ.. పేస్లిప్స్‌ చూడండి 

10 Oct, 2019 10:48 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌ : ఆర్టీసీలో సీనియర్‌ ఉద్యోగులు రూ.50వేల వేతనం తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్‌ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని బస్‌డిపో వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. పే స్లిప్పులను  చూపిస్తూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం రూ.25వేలే జీతం ఉందన్నారు.

సీనియారిటీ ఉన్నవారందరికీ రూ.50 జీతాలు తీసుకుంటున్నారని సీఎం అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీనియారిటీ ఉన్నప్పటికీ రూ.25 వేలకు మించి లేవని, దీనికి రుజువులు తమ పేస్లిప్‌లేనన్నారు. సీఎం కేసీఆర్‌ ఒకసారి పేస్లిప్‌లను పరిశీలించి చూసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆర్టీసీ కార్మికులకు భారీగా వేతనాలు ఉన్నాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇందులో ఆదిలాబాద్‌ జిల్లా జేఏసీ కన్వీనర్‌ ఏఆర్‌ రెడ్డి, జేఏసీ నాయకులు గంగాధర్, చందర్, నారాయణ, జమీర్, శ్రీనివాస్, రాజేశ్వర్, పోశెట్టి, శంకర్‌ తదితరులున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్‌ సరికొత్త వ్యూహం

వారిద్దరు నాకు ఆదర్శం: తమిళి సై

ఆర్టీసీ సమ్మెపై విచారణ 15కు వాయిదా

ప్రతి బస్సులో చార్జీల పట్టిక

‘డయల్‌ 100’ అదుర్స్‌!

దసరా వేడుకల్లో రగడ

ఐదోరోజు.. అదే ఆందోళన

ఆర్టీసీ సమ్మె: నేడు హైకోర్టులో విచారణ

హుజూర్‌నగర్‌లో ప్రచార జోరు పెంచిన ప్రధాన పార్టీలు

వాళ్లకి వేతనాలు ఇచ్చేదెలా?

అందరూ ఉన్న అనాథ

కేటీపీఎస్‌లో ఇనుము దొంగలు.. 

వారంలో జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్‌

సాధారణ బస్సు చార్జీలకు మించి వసూలు చేయొద్దు

వైద్యుల మధ్య అంతర్గత యుద్ధం

అద్దెలొద్దంట!

పైలెట్‌లోనే సవాళ్లు

చుక్‌..చుక్‌..బండి 150 ఏండ్లండీ!

కమిషనరేట్‌ పరిధిలో సిటీ పోలీస్‌ యాక్ట్‌

తొలిరోజే 233 దరఖాస్తులు

భారతీయ సంస్కృతి చాలా గొప్పది

స్కాంపై ఏసీబీ ప్రశ్నల వర్షం

దేవికారాణి వెనుక ఎవరు?

త్వరలోనే ఖాతాల్లోకి ‘రైతుబంధు’ 

పిల్లలకు పెద్దల జబ్బులు!

యువత భాగస్వామ్యంతో పల్లెల్లో మార్పు

ఆర్టీసీ సమ్మె: భార్య ఉద్యోగం పోతుందనే బెంగతో

సర్కార్‌ దిగిరాకపోతే సకల జనుల సమ్మె

సీఎం ఆదేశాలతో ఉద్యోగాల భర్తీపై ఆర్టీసీ కసరత్తు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ విన్నర్‌గా ప్రముఖ సింగర్‌!

బిగ్‌బాస్‌: అందరి బండారాలు బయటపడ్డాయి!

స్టార్‌ ఆఫ్‌ ద బిగ్‌బాస్‌ హౌస్‌ ఆ ఇద్దరే!

బిగ్‌బాస్‌ షోను నిషేధించండి!

నటుడు శింబుపై నిర్మాత ఫిర్యాదు

బోల్డ్‌ కంటెంట్‌ కథలో భాగమే