రేపు భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తాం : ఆర్టీసీ జేఏసీ

10 Oct, 2019 18:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తమ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. భవిష్యత్‌ కార్యచరణపై చర్చించేందుకు గురువారం సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నాయకులు.. రేపు మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌ చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే నిర్ణయించినా రేపటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేపు అన్ని డిపోల ముందు మౌన ప్రదర్శన చేపడతామని వెల్లడించారు. అన్ని ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపాలని కోరారు. పలుచోట్ల ఆర్టీసీ కార్మికులను పోలీసుల అరెస్ట్‌ చేయడాన్ని ఖండించారు.

ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా రవాణాను కాపాడుకునేందుకే తాము సమ్మె చేపట్టినట్టు తెలిపారు. రేపు అన్ని రాజకీయ పార్టీలను కలువనున్నట్టు చెప్పారు. రేపు, ఎల్లుండి శాసనసభ్యులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఎల్లుండి గాంధీ, జయశంకర్‌ విగ్రహాల ముందు మౌన దీక్షలకు దిగుతామన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా