పాలకులు మోసం చేశారు

20 Aug, 2015 04:37 IST|Sakshi
పాలకులు మోసం చేశారు

- పునరావాసం కల్పించాలి
- మాజీ మావోరుుస్టుల సంఘం ఆధ్వర్యంలో దీక్ష
ప్రగతినగర్ :
లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చి పాలకులు తమను మోసం చేశారని మాజీ మావోయిస్టుల ఫోరం ఆరోపించింది. సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. తాము జనజీవన స్రవంతిలో కలిస్తే ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఉపాధి అవకాశాలు చూపిస్తామని గత పాలకులు హామీ ఇచ్చారని, అరుుతే ఇప్పటివరకూ తమకు ఎలాంటి  సౌకర్యాలు కల్పించలేదని అన్నారు.

రాజీవ్ యువశక్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు ఇప్పిస్తామని ప్రకటించి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. తమ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంతా తమను మోసం చేస్తూనే ఉన్నారని వాపోయూరు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయనుకున్నామని, మాజీ నక్సల్స్‌ను ఆదుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమి, ఇంటి స్థలం, ఇల్లు, ఉపాధి కోసం రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చందు, ఫిరోజ్‌ఖాన్, బంజారరెడ్డి,చందర్, లక్షయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు