సీఎంఆర్ నిబంధనల సడలింపు!

15 Nov, 2016 01:08 IST|Sakshi
సీఎంఆర్ నిబంధనల సడలింపు!

పౌరసరఫరాల శాఖ అధికారుల భేటీలో మంత్రి ఈటల నిర్ణయం
మిల్లర్లకు చివరి అవకాశం   

సాక్షి , హైదరాబాద్: ఈ ఖరీఫ్ సీజన్‌లో సన్న రకం వడ్లను అత్యధికంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణ యానికి వచ్చింది. ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం వినియోగిస్తున్న సర్కారు వీటికి అవసరమైన వడ్లను స్టేట్ పూల్ నుంచి కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఇందు కోసం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నిబం ధనలను స్వల్పంగా సడలించాలను కుం టోంది. ఈ మేరకు ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం సచివాలంయలో పౌర సరఫరాలశాఖ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కమిషనర్ సీవీ ఆనంద్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు.

ధాన్యం సేకరణను తక్కువ సమయంలో పూర్తి చేయడానికి మిల్లర్లకు కూడా చివరి అవకాశం ఇద్దామని ఈటల ఈ భేటీలో పేర్కొన్నారు. భవిష్యత్తులో పొరపాట్లకు తావివ్వకుండా సీఎంఆర్‌పై దృష్టిపెట్టాలని ఆదేశించారు. గతంలో అక్రమ దందాలకు పాల్పడిన మిల్లర్లు, రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసిన మిల్లర్లకు సంబంధించిన కేసుల తీవ్రతనుబట్టి సీఎంఆర్ కోసం ధాన్యం ఇవ్వకూడదని నిర్ణరుుంచారు.  స్టాకులో తేడాలు, సీఎంఆర్ బకారుుల తది తరాలపై నమోదైన కేసులు ఎదుర్కొంటున్న మిల్లర్లకు ఈసారికి సీఎంఆర్‌లో ధాన్యం ఇవ్వాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుత సీజన్‌లో ప్రారం భమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర చెల్లించేలా, రైతులకు ధాన్యం సొమ్ము సకాలంలో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈటల ఆదేశిం చారు. రేషన్ షాపుల్లో ఈ-పాస్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థారుులో ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రంలో ఉప్పు కొరత లేదని, 900 మెట్రిక్ టన్నుల ఉప్పు నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. నిత్యావస రాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించే వ్యాపా రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈటల హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు