గ్రామీణ పోస్టల్ సేవకుల సమస్యలపై కమిటీ

3 Jan, 2016 03:50 IST|Sakshi
గ్రామీణ పోస్టల్ సేవకుల సమస్యలపై కమిటీ

ఎంపీ పొంగులేటి లేఖకు స్పందించిన కేంద్రం
 
 సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామీణ పోస్టల్ సేవకుల సమస్యల పరిష్కారానికి కేంద్రప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేసిందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన ఇటీవల కేంద్ర కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు లేఖ రాశారు. గ్రామీణ పోస్టల్ సేవలను క్రమబద్ధీకరించడంతోపాటు వారి జీతభత్యాలను పెంచడం, ఉద్యోగ భద్రత కల్పించడానికి సుప్రీం లేదా.. హైకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని ఎంపీ ఆ లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. దీనికి స్పందించిన మంత్రి ఆర్థికశాఖ అనుమతితో సంబంధిత శాఖలో సీనియర్ అధికారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారని పొంగులేటి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ ఏకసభ్య కమిటీ ద్వారా గ్రామీణ పోస్టల్ సేవకుల సమస్యలు, వారి డిమాండ్లు పరిష్కరించడానికి, వాటి అమలు సాధ్యాసాధ్యాలు, జీతభత్యాల పెంపు తదితర విషయాలను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. అలాగే వారి ఉద్యోగ భద్రత, సర్వీస్ క్రమబద్ధీకరణ తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసేందుకు రవిశంకర్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారన్నారు.

మరిన్ని వార్తలు