మేలు చేసేందుకే ‘రైతుబంధు’

13 May, 2018 06:38 IST|Sakshi
చెక్కులను అందజేస్తున్న రాజ్యసభ సభ్యులు డీఎస్, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా

నిజామాబాద్‌ అగ్రికల్చర్‌(నిజామాబాద్‌ అర్బన్‌) : రాష్ట్రంలోని రైతులకు మేలు చేసేందుకే సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి పంటకు రూ.4వేలను అందిస్తున్నారని రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్, అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా అన్నారు. శనివారం నగరంలోని మానిక్‌భవన్‌ స్కూల్‌లో రైతుబంధు పథకం చెక్కులు, పట్టాపాస్‌పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్‌ అని, వారు పెట్టుబడుల కోసం ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవద్దనే ఉద్ధేశంతోనే రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.4వేలను అందిస్తున్నారని రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.

గ్రామాల్లో అన్నివర్గాల రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు.   అలాగే 24 గంటల నిరంతర విద్యుత్, మద్దతు ధరలకు పంటల కొనుగోళ్లు, పెట్టుబడి సాయం, తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా మొత్తం 459 మంది రైతులకుగాను 283 మందికి రూ.12.30లక్షల వి లువైన చెక్కులు, పట్టాపాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో నగర మేయర్‌ ఆకుల సుజాత, నిజామాబాద్‌ ఎంపీపీ యాదగిరి, జడ్పీటీసీ పుప్పాల శోభ, కార్పొరేటర్లు, వ్యవసాయశా ఖ ఏడీఏ వెంకట రవిందర్, ఏఓలు, రెవెన్యూ అధికారులు, ఏఈఓలు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు