‘రైతుబంధు’వు రూ.88.81 కోట్లు

7 Jun, 2019 13:08 IST|Sakshi

హన్మకొండ: వాన చినుకు పడింది మొదలు పొలం, సాగు పనులే లోకంగా అన్నదాతలు జీవనం సాగిస్తారు.. అయితే, అతివృష్టి.. లేదంటే అనావృష్టి.. ఇంకా చెబితే చీడపీడల కారణంగా అన్నదాతకు పంటలపై వచ్చే ఆదాయం ఏ మూలకు సరిపోవడం లేదు.. ఫలితంగా ఎప్పటికప్పుడు పెట్టుబడి సాయం కోసం ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఈ ఇబ్బందులను గుర్తించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎకరానికి రూ.4వేల చొప్పున సాయం అందించేందుకు ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఎకరానికి రూ.4వేల చొప్పున నగదు అందజేశారు. అయితే, గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టుబడి సాయాన్ని రూ.5వేలకు పెంచనున్నట్లు ప్రకటించిన టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ హామీని అమలు చేసేందుకు సన్నద్ధమైంది. ప్రస్తుతం ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ఈ నగదును ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ప్రణాళికాయుతంగా..
గత వానాకాలం, యాసంగి సీజన్‌లో రైతుబంధు కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఇప్పుడు మూడో సారి ప్రస్తుత వానాకాలం సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఈ సీజన్‌ నుంచి ఎకరాకు రూ.5 వేలు చెల్లించనున్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. వచ్చే నెలలో రైతులకు రైతుబంధు సాయం అందించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా నుంచి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. రబీలో రైతుబంధు అందించే సమయానికి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ నగదు రూపంలో కాకుండా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. దీంతో అదే విధానాన్ని ఈ ఖరీఫ్‌లోనూ అమలు చేయనున్నారు. ఇప్పటికే వివరాలన్నీ సిద్ధం కాగా.. ఈనెలలోనే రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందజేయనున్నారు.

11 మండలాలు... 77,079 మంది రైతులు
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 77,079 మంది రైతులు, 1,77,619.2 ఎకరాల సాగు భూమి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు ఎకరాకు రూ.5వేల చొప్పున జిల్లాలోని రైతులకు రూ.88,81,25,992.5 పెట్టుబడి సాయం అందనుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వివాదాస్పదంగా మారిన బిగ్‌బాస్‌ రియాలిటీ షో

ఏసీబీకి చిక్కిన ఐఐటీ టాప్‌ ర్యాంకర్‌

మున్సిపల్‌ ఓటర్ల జాబితా సిద్ధం

స్పెషలిస్టులు ఊస్టింగే?

‘కిసాన్‌ సమ్మాన్‌’తో రైతులకు అవమానమే

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

అతడి పేరు డ డ.. తండ్రి పేరు హ హ...

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

పాత నోట్లు.. కొత్త పాట్లు!

ధర్మాధికారి నిర్ణయంపై అప్పీల్‌కు అవకాశం

‘విద్యుత్‌’పై ఎల్‌సీ వద్దు 

దోస్త్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ

మానసిక రోగులకు హాఫ్‌వే హోంలు! 

నిధుల సమీకరణపై దృష్టి!

పోలీసు శాఖలో బదిలీలకు కసరత్తు 

పీఎం–కిసాన్‌కు 34.51 లక్షల మంది రైతులు 

బిగ్‌బాస్‌ ప్రసారం నిలిపివేయాలి

అయితే డొక్కు.. లేదా తుక్కు!

ట్రాఫిక్‌ చిక్కులూ లెక్కేస్తారు!

మన్ను.. మన్నిక ఇక్రిశాట్‌ చెప్పునిక!

ఎక్కడికైనా బదిలీ!

ఈనాటి ముఖ్యాంశాలు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు

చందానగర్ పీఎస్‌ను ఆదర్శంగా తీసుకోండి

150 మంది చిన్నారులకు విముక్తి​

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు