రైతుకు ధీమా

7 Aug, 2018 14:25 IST|Sakshi
బోధన్‌ మండలం పెగడపల్లిలో రైతులకు బీమా బాండ్లను అందిస్తున్న డీఏవో గోవింద్‌ 

నేటి నుంచి బాండ్లు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యేలు

13 వరకు గ్రామ  సభలలో జారీ..

గ్రామాల్లో ఒక రోజు ముందుగా దండోరా

మోర్తాడ్‌(బాల్కొండ) : రైతుబంధు పథకం అమలులో భాగంగా రైతులకు ప్రభుత్వం జీవిత బీమా సంస్థ ద్వారా రూ.5 లక్షల విలువ చేసే బీమా బాండ్ల జారీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో కొంతమంది రైతులకు వ్యవసాయ అధికారి గోవింద్‌ లాంఛనం గా సోమవారం బాండ్‌లను అందివ్వగా, మంగళవారం నుంచి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పంపణీ చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 1,45,000 మంది రైతులు బీమా బాండ్లకు అర్హత సాధించారు.

అయితే ఆధార్‌ కార్డులు సమర్పించిన రైతులకే బాండ్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు మొదటి విడతలో 97,238 మంది రైతులకు బాండ్లను ఈనెల 13 వరకు ఇవ్వనున్నారు. ఒక్కో రైతు పేరిట రాష్ట్ర ప్రభుత్వమే రూ.2,791 ప్రీమియం జీవిత బీమా సంస్థకు చెల్లించింది. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం పొం దిన రైతులకు బీమా వర్తించే విధంగా ప్ర భుత్వం చర్యలు తీసుకుంది. 18 ఏళ్ల నుం చి 59 ఏళ్ల వయస్సు లోపు వారికి బీమా ప్రయోజనాలను వర్తించే విధంగా ప్రభు త్వం నిర్దేశించింది.

పెట్టుబడి సహాయం అనేక మంది రైతులు పొందినా బీమాకు సంబంధించి వయస్సును పరిగణనలోకి తీసుకోవడం తో కొందరికే బీమా బాండ్లు జారీ కానున్నాయి. ఇప్పటికే ఏ గ్రామంలో ఏ రోజు బాండ్లను ఇవ్వనున్నారో వ్యవసాయ శాఖ అధికారులు షెడ్యూల్‌ను ఖ రారు చేశారు. బాండ్లను జారీ చేసే గ్రా మంలో ఒక రోజు ముందుగానే దండోరా వేయించనున్నా రు. పెట్టుబడి సహాయం చెక్కులను పంపిణీ చేసిన విధంగానే బీ మా బాండ్ల జారీ కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

రెండో విడతలో 

రెండో విడతలో ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది రైతులకు బాండ్లు పంపిణీ చేయనున్నామని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ తెలిపారు. రెండో విడతకు సంబంధించిన బాండ్లు కూడా త్వరలోనే జిల్లాకు చేరనున్నాయని ఆయ న వివరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే ’

బీజేపీలో నాకు తలుపులు మూసుకుపోలేదు..

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఈనాటి ముఖ్యాంశాలు

కేటీఆర్‌.. మీతో ఛాయ్‌ కా, ఇంకేమైనా ఉందా?

మున్సిపల్‌ ఎన్నికలకు ఎందుకంత హడావుడి?

గెలుపు ఓటముల్లో అతివలదే హవా..

లక్ష మందితో బహిరంగ సభ: ఎమ్మెల్యే

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

రామయ్యా.. ఊపిరి పీల్చుకో 

బాలిక కిడ్నాప్‌ కలకలం 

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కాంగ్రెస్‌ సభ్యుల నిరసన; కేసీఆర్‌ స‍్పందన

మనకూ ‘ముంబై’ ముప్పు

‘కాంగ్రెస్‌ అనాథగా మారిపోయింది’

పట్నంలో అడవి దోమ!

ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు

బైకుల దొంగ అరెస్ట్‌

కేఎంసీ వర్సెస్‌ ఎంజీఎం 

'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

కొత్తపట్నం ఏర్పాటు ఇలా..

నీళ్లు ఫుల్‌

నగరంలోకి ఎలక్ర్టికల్‌ బస్సులు

వివాహేతర సంబంధం పెట్టుకుందని..

ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..

అణచి వేసేందుకే మావోయిస్టు ముద్ర

చదువుతో పాటు.. ఉద్యోగం

మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్‌

ఎట్టకేలకు ఒక్కటైన ప్రేమికులు

అత్తను చంపిన కోడలు అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

మూడోసారి తండ్రి అయిన హీరో!

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..