ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షలు ఖర్చు 

16 Mar, 2020 03:39 IST|Sakshi

విద్యా శాఖ పద్దులపై చర్చలో మంత్రి సబిత వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సగటున రూ.1.25లక్షలు ఖర్చు చేస్తూ వారికి నాణ్యమైన విద్య, భోజనం, వసతులు కల్పిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నైతిక విలువలతో కూడిన గుణాత్మక విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. ఆదివారం శాసనసభలో పద్దులపై చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలలు 29,275 నడుస్తున్నాయి. వీటిలో 25.51లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి రూ.110కోట్లతో యూని ఫాంలు అందిస్తున్నాం. రూ.75కోట్లు ఖర్చు చే సి పాఠ్యపుస్తకాలు, ప్రభుత్వ స్కూళ్లల్లో రూ. 474 కోట్లతో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నా.

ఇప్పటికే తల్లిదండ్రుల అభీష్టం మేరకు 9,537 పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియంవిగా మార్చాం’అని వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నామని, అనుమతుల్లేని పాఠశాలలపై కఠినం గా వ్యవహరిస్తున్నామని, ఫీజుల నియంత్రణ కు చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఢి ల్లీ తరహా స్కూళ్లు ఏర్పాటు చేయాలన్న డిమాం డ్‌ ఉందని, దీన్ని ప్రయోగాత్మకంగా జీహెచ్‌ ఎంసీ పరిధిలో అమలుపరిచేలా చర్యలు మొదలయ్యాయన్నారు.  పర్యాటక, సాం స్కృతిక, క్రీడాశాఖ పద్దుల పై మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌  సమాధానమిస్తూ, ప్రతి మెట్రో స్టేషన్‌ నుంచి అం తర్గత రవాణాకు వీలుగా ఎలక్ట్రిక్‌ ఆటో, బస్సులను ప్రవేశపెట్టే ఆ లోచన ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు.

మంచిని చెప్పు.. అమ్మ ఆశీర్వదిస్తది...
ప్రభుత్వం పర్యాటక అభివృధ్ధికి అనేక చర్య లు తీసుకుందని, వరంగల్, ములుగు ప్రాం తాల్లో అనేక అభివృద్ధి చర్యలు చేపట్టినా, కాం గ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఒక్క మంచి పనిని చెప్పలేదని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘అమ్మా మంచి చేస్తే మంచిని చెప్పాలి. మీ నియోజకవర్గంలో చెరువులను తీర్చిదిద్దినా, మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు చేసినా ప్రభుత్వం చేసిన ఒక్క పని ని మెచ్చుకోలే. మంచిని చెబితే అమ్మ సైతం ఆశీర్వదిస్తుంది’అంటూ చమత్కరించారు.

మరిన్ని వార్తలు