నిమజ్జనంలో అపశ్రుతులు

24 Sep, 2018 09:25 IST|Sakshi
బోల్తాపడ్డ ఆటోను పైకిలేపుతున్న పోలీసులు ,ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

చిన్న చిన్న అపశ్రుతులు మినహా ఆదివారం నగరంలో గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగింది. నాంపల్లి పరిధిలో విధినిర్వహణలో ఉన్న ఓ ఏఎస్‌ఐ గుండెపోటుతో మృతి చెందాడు. ట్యాంక్‌బండ్‌పై ఓ మహిళ ట్రాక్టర్‌పై నుంచి కిందపడి మృతి చెందింది. సుల్తాన్‌బజార్‌ ప్రాంతంలో మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

అబిడ్స్‌: నిమజ్జనానికి వెళ్లి వస్తున్న ఓ ఆటో బోల్తాపడిన సంఘటన అబిడ్స్‌ చౌరస్తాలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..పాతబస్తీకి చెందిన  నిమజ్జనానికి వెళ్లిన ఆటో భక్తులతో కలిసి తిరిగివెళుతుండగా రామకృష్ణ థియేటర్‌ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలు ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు గాయాలయ్యా యి. నిమజ్జనం డ్యూటీలో ఉన్న పోలీసులు ఆటోను పైకి లేపి బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అబిడ్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుండెపోటుతో ఏఎస్సై మృతి
నాంపల్లి: విధి నిర్వహ ణలో ఓ ఏఎస్సై గుండె పోటుతో మృతిచెందిన సంఘటన హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఏఎస్సై నిమ్రా నాయక్‌(55) వినాయక నిమజ్జనం సందర్భం గా నగరంలో విధులు నిర్వహించేందుకు వచ్చా రు. హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కరోడ్‌మాల్‌ బిల్డింగ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆది వారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న నిమ్రానాయక్‌ గుండెపోటుతో అస్వస్తతకు గురికావడంతో హబీబ్‌నగర్‌ పోలీసులు అతడిని సమీప ంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచ న మేరకు నాంపలి లోని కేర్‌ ఆస్పత్రికి తరిలించగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని అతని స్వస్థలానికి తరలించారు.

ట్రాక్టర్‌ కిందపడి మహిళ మృతి
కవాడిగూడ:     ట్యాంక్‌బండ్‌పై గణేష్‌ నిమజ్జనం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది.  ట్రాక్టర్‌ టైరు కింద పడి ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. రెజిమెంటల్‌ బజార్‌కు చెందిన హేమలత (46) కుమారుడు అభిషేక్‌తోపాటు కాలనీవాసులతో కలిసి శనివారం రాత్రి వినా యకుడిని నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్‌పై  ట్యాంక్‌బండ్‌ వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌పై నిలుచున్న హేమలత ఇళ్లల్లో ఉంచి చిన్నవినాయకులను కిందకు అందిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ ట్రాక్టర్‌ను ముందుకు కదిలించడంతో ఆమె అదుపు తప్పి కిందపడింది.  కంగారుపడిన డ్రైవర్‌ ట్రాక్టర్‌ను రివర్స్‌ చేయడంతో చక్రాలు ఆమె మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

ట్రక్కు డ్రైవర్‌ అరెస్ట్‌
సుల్తాన్‌బజార్‌/అఫ్జల్‌గంజ్‌: వినాయక నిమజ్జనోత్సవంలో బేగంబజార్‌ నుంచి భారీ గణనాధుని తరలించే ట్రక్కు డ్రైవర్‌ మద్యం సేవించినట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్‌కు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.

>
మరిన్ని వార్తలు