విషాదాన్ని గుర్తు చేసుకుంటూ...

24 Jul, 2015 23:39 IST|Sakshi
విషాదాన్ని గుర్తు చేసుకుంటూ...

♦ కన్నీటి సంద్రమైన మాసాయిపేట రైల్వే క్రాసింగ్
♦ రైలు దుర్ఘటనలో అసువులు బాసిన చిన్నారులకు నివాళి
♦ బరువెక్కిన హృదయాలతో తరలివచ్చిన మృతుల కుటుంబీకులు
 
 వెల్దుర్తి : సాయిపేట రైలు దుర్ఘఅభం..శుభం తెలియని 16 మంది చిన్నారులను బలిగొన్న మాటన జరిగి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం తూప్రాన్ మండలం వెంకటాయపల్లి, కిష్టాపూర్, గుండ్రెడిపల్లి, ఇస్లాం పూర్ గ్రామాలకు చెందిన మృతుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున మాసాయిపేట రైల్వే క్రాసింగ్‌కు చేరుకున్నారు. ఘటనా స్థలంలో చిన్నారుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద కన్నీటితో నివాళులర్పించారు. పిల్లల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు.

చిన్నారుల చిత్రపటాలను చూస్తూ వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు రోదనలతో అంతా చలించిపోయారు. మొదట గ్రామ సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ సిద్దిరాంలుగౌడ్, మాజీ సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ నర్సింహులు, ఎమ్మార్పీఎస్‌జిల్లా ఇంచార్జ్ యాదగిరిలతో పాటు స్థానిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, యువకులు పాఠశాల నుంచి సంఘటన స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 ఎక్కడికి వెళ్లావ్ నేస్తమా..
 రైలు దుర్ఘటనలో అసువులు బాసిన చిన్నారుల చిత్రపటాలను చూస్తూఎక్కడికి వెళ్లారు నేస్తమా.. అంటూ అదే ప్రమాదం నుంచి బయటపడిన చిన్నారులు రుచిత, త్రిషా, నబీరా, వరుణ్‌గౌడ్‌లు కంటతడిపెట్టారు. రైలు దుర్ఘటన జరిగిన సంఘటనను గుర్తుకుచేసుకుంటూ కన్నీటి పర్వంతమయ్యారు. ఫొటోల వద్ద నివాళులర్పిస్తూ ఎప్పుడు వస్తారు నేస్తమా అంటూ రోదించారు
 
 ఆశలన్ని కూలిపాయే..  ఆనవాళ్లు దూరమాయే..
 రైలు దుర్ఘటనను గుర్తు చేసుకుంటూ ప్రమాదంలో గాయాలతో బయటపడినత్రిషా, నబీరా, రుచిత, వరుణ్‌గౌడ్‌తో పాటు  మాసాయిపేటకు చెందిన సాహితీ, సంకేత్ కంటతడి పెడుతూ... ఇప్పుడిప్పుడే విరబూస్తున్న రాలిపోయిన పూవుల్లరా.. ఆశలన్ని కూలిపాయే.. ఆనవాళ్లు దూరమాయే.. అంటూ ఆలపించిన పాట ప్రజలను కన్నీళ్లు పెట్టించింది.
 
 స్మృతి వనం ఏర్పాటు చేయాలి
  వెల్దుర్తి : మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెం దిన చిన్నారుల జ్ఞాపకార్థం వెంటనే రైల్వే క్రాసింగ్ వద్ద స్మృతి వనం ఏర్పాటు చేయాలని మృతుల బంధువులు, ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన సందర్భంగా గాయపడిన చిన్నారులతో పాటు మృతి చెందిన వారి తల్లిదండ్రులకు హెల్త్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చిన అధికారులు నేటికీ ఇవ్వలేదని ఆరోపించారు. చిన్నారుల మృతికి చిహ్నంగా సం ఘటన స్థలంలో స్మృతివనం ఏర్పాటు చేసి స్థూపం నిర్మిస్తామని ప్రకటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల మాటలు నీటి మూటలుగానే మిగిలాయని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా నవతాదృక్పదంతో స్మృతి వనం ఏర్పాటు చేసి చిన్నారుల ఆత్మశాంతికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
 
 చేగుంటలో మానవహారం
  చేగుంట : మాసాయిపేట రైలు దుర్ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా చేగుంటలో పలు విద్యా సంస్థలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు శుక్రవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. చేగుంట గాంధీ చౌరాస్తా వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, ఉపాధ్యాయులు, యువజన సంఘాల సభ్యులుపాల్గొన్నారు.

మరిన్ని వార్తలు