-

సదరం.. గందరగోళం

4 Aug, 2014 05:22 IST|Sakshi
  •      6 నె లలుగా ఊసే లేని క్యాంపులు
  •      వైద్యులకు నిలిచిపోయిన చెల్లింపులు
  •      శిబిరాలకు ముఖం చాటేస్తున్న డాక్టర్లు
  •      సంతకాల్లేక జారీ కాని వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్లు
  •      అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వికలాంగులు
  •      పరీక్షల కోసం 15 వేల మంది నిరీక్షణ
  • హన్మకొండ అర్బన్ :  డీఆర్‌డీఏ పింఛన్ల విభాగం ఆధ్వర్యంలో ఇంతకాలం జిల్లాలో కొనసాగిన సదరం వైద్యశిబిరాల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. వికలాంగుల వైకల్య శాతం నిర్ధారణకు నిరంతరం కొనసాగాల్సిన శిబిరాలు ఆరు నెలలుగా మూతబడ్డాయి. ఫలితంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చే వికలాంగుల సంఖ్య పెరుగుతోంది. నిధుల మంజూరులో సెర్ప్ అధికారుల నిర్లక్ష్యం... వైద్యశాఖ, డీఆర్‌డీఏ అధికారుల సమన్వయ లోపం వికలాంగుల పాలిట శాపంగా మారింది. సదరం వైద్య శిబిరాల నిర్వహణ ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
     
    వైద్యులకు రూ.4 లక్షల బకాయిలు..
     
    జిల్లాలో సదరం వైద్య పరీక్షల కోసం మహ బూబాబాద్, జనగామ, ఏటూరునాగారం, ఎంజీఎంలో ప్రత్యేక మెడికల్ బో ర్డులు ఏర్పాటు చేశారు. వీటిలో ఈఎన్‌టీ, ఆర్థో, సైకియాట్రిస్ట్, ఎంఆర్ వైద్యులు ఉంటారు. ప్రతి వైద్యుడు రోజుకు సుమారు 70 మంది వరకు రోగులను పరీక్షించడంతోపాటు వారికి సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక్కో పేషెంట్‌కు కొంత చొప్పున డీఆర్‌డీఏ ద్వారా సంబంధిత బోర్డులోని వైద్యులకు చెల్లింపులు చేయూలి. కానీ... చాలాకాలంగా అవి పెండింగ్‌లో పడ్డారుు. సుమారు రూ.4లక్షలకు పైగా బకాయిలు ఉండడంతో సదరం శిబిరాల నిర్వహణ,సర్టిఫికెట్ల జారీపై వైద్యులుఆసక్తి చూపడం లేదు.
     
    మూలకుపడ్డ 3 వేల సర్టిఫికెట్లు..

    చేసిన పనికి డబ్బులు రాకపోవడంతో డాక్టర్లు శిబిరాల వైపు కన్నెత్తి చూడడం లేదు. చెల్లింపులు చేయనిదే సంతకాల విషయంలో వైద్యులను అడిగే ధైర్యం డీఆర్‌డీఏ అధికారులు చే యలేకపోతున్నారు. ఫలితంగా గతంలో సదరం పరీక్షలు చేయించుకున్న వారికి సంబంధించి సుమారు 3 వేల సర్టిఫికెట్లు వైద్యుల ధ్రువీకరణ సంతకాలు లేక మూలకుపడ్డాయి. దీంతో వికలాంగులు పింఛన్, ప్రభుత్వ పథకాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తూ.. ఇబ్బందులు పడుతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పాలో తెలియక ప్రతి సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రాలు ఇస్తున్నారు.
     
    పరీక్షల కోసం 15 వేల మంది నిరీక్షణ..
     
    ఒక వైపు పరీక్షలు చేయించుకున్నవారు సర్టిఫికెట్ల కోసం నిరీ క్షిస్తుండగా... మరో వైపు కొత్తగా పరీక్షలు చేయించుకోవాల్సిన వారు, గతంలో తమకు అన్యాయం జరిగిందంటూ రీ అసెస్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాలో 15వేల మంది వరకు ఉన్నారు. వీరందరూ  క్యాంపులు ఎప్పుడు నిర్వహిస్తారా.. అని రోజు ఎదురుచూస్తున్నారు.
     
    మూడేళ్లుగా తిప్పుకుంటున్నారు..

     
    నాకు చెముడు ఉంది. ఎడమ చేతికి రెండు వేళ్లు కూడా లేవు. 2011 నుంచి వికలాంగుల పింఛన్ రావడంలేదు. సదరం క్యాంపులకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నా. ఎంజీఎంకు, డీఆర్‌డీఏ కార్యాలయూనికి తిరిగినా..  సర్టిఫికెట్ ఇవ్వలేదు. మొదటిసారి 39 శాతం ఉందని తొలగించారు. అప్పుడు చెముడు ఒక్కటే పరిశీలించారు. చేతి వేళ్లు లేని విషయం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో తక్కువ శాతం వైకల్యం ఉంది. ఈ విషయం చెప్పి మళ్లీ సదరం పరీక్ష చేయాలని ఎన్నిసా ర్లు తిరిగినా... మేమే సమాచారం ఇస్తామంటున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి.
     - సాదినేని శివకుమార్, కడిపికొండ
     
     సదరం శిబిరం నిరంతరం ఉండాలి
     వికలాంగులకు వైకల్య శాతం నిర్దారించేందుకు క్యాంపుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండొద్దు. అలా ఉంటే వికలాంగులు నష్టపోవాల్సి వస్తుంది. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇంటి స్థలాల వంటివి ఒకసారి మంజూరు చేస్తే... మళ్లీ రెండు మూడేళ్లవరకు అవకాశం ఉండదు. ఈ మేరకు సదరం శిబిరాలను ఆటంకం లేకుండా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలి.
     - లక్కిరెడ్డి సత్యం, వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు
     
     త్వరలో పరిష్కరిస్తాం...
     సదరం క్యాంపుల నిర్వహణలో కొంత ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. వైద్యులకు చెల్లించాల్సిన మొత్తం సెర్ప్ నుంచి రావాల్సి ఉంది. అవి రాగానే ఇస్తాం. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సంతకాలు కాక సర్టిఫికెట్లు మూలకుపడ్డాయి. ఈ సమస్య ను కూడా త్వరలో పరిష్కరిస్తాం. క్యాంపుల నిర్వహణ బాధ్యత పూర్తిగా ఎంజీఎం మెడికల్ బోర్డుకే అప్పగించారు. చెల్లింపులు కాగానే... వారితో సంప్రదించి తదుపరి క్యాంపు తేదీలు ఖరారు చేస్తాం.
     - పద్మప్రియ, డీఆర్‌డీఏ,ఐకేపీ వికలాంగుల విభాగం డీపీఎం
     

మరిన్ని వార్తలు