సురక్షిత ప్రయాణమే లక్ష్యం

9 Feb, 2016 01:59 IST|Sakshi

గంటకు మించి ఆలస్యం కాదు
వేగ నియంత్రణతో మేలే ఎక్కువ
 మేడారం రూట్‌మ్యాప్ వివరాలతో యాప్
ఆర్టీసీ క్యూలైన్లపై విస్తృత ప్రచారం
రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్ ఝా

 
 హన్మకొండ :  మేడారం జాతరకు వచ్చి వెళ్లే భక్తులు ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. వన దేవతల గద్దెల వద్దకు చేరేందుకు ఏర్పాటు చేసిన రెండు ప్రధాన క్యూ లైన్ల వద్ద రద్దీకి అనుగుణంగా భక్తులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. మేడారం దారుల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కొత్తగా బైక్‌పార్టీలు అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. జాతర ఏర్పాట్లపై   ఎస్పీ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే...

వేగ నియంత్రణతో మేలు
వేలాదిగా వాహనాలు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వేగ నియంత్రణ అవసరం. ఓవర్‌టేక్ చేసే సమయంలో ఏ ఒక్క చోట ఇబ్బంది ఏర్పడినా.. దాని ప్రభావం దారి పొడుగునా ఉంటుంది. అందువల్లే ఈ సారి కటాక్షాపూర్ - తాడ్వాయి మధ్య వేగ నియంత్రణ అమల్లోకి తెస్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు కటాక్షాపూర్ నుంచి గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేస్తున్నాం. దీనివల్ల మొత్తం ప్రయాణంలో గంట ఆలస్యమైనా ఎక్కడా ఇబ్బంది రాకుండా ప్రయాణం సాఫీగా జరుగుతుంది. ఎక్కడైనా సమస్య తలెత్తినా సరిదిద్దడం తేలికవుతుంది. హోల్డింగ్ పాయింట్ల నుంచి భక్తులను తరలించేందుకు ఆర్టీసీతో సంప్రదించాం. చిన్నబోయినపల్లి దగ్గర 25 బస్సులు, తాడ్వాయి, పస్రా వద్ద 15 బస్సుల చొప్పున అందుబాటులో ఉంచుతున్నాం. చింతల్‌క్రాస్ వద్ద కూడా షటిల్ బస్సులు ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు బైక్ పార్టీలను అందుబాటులో ఉంచుతున్నాం. వీరు సాధ్యమైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తారు.

రామప్ప ఆలయాన్ని దర్శించుకునే వారు తిరుగు ప్రయాణంలో గాంధీనగర్ క్రాస్‌రోడ్డు మీదుగా రామప్పకు చేరుకోవచ్చు. ఈ దారిలో ఎటువంటి ఆంక్షలూ లేవు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చే మార్గాన్ని విస్తరించారు. దీంతో సగం సమస్య తీరిపోయినట్టే. భక్తులు పోలీసులకు సహకరిస్తే సమ్మక్క రాకను ఇబ్బంది లేకుండా చూడొచ్చు. తోపులాటకు పాల్పడవద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. భద్రత ఏర్పాట్లలో భాగంగా జాతర ప్రాంగణలో మొత్తం 100కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా అందుబాటులో ఉన్న ఐదు వాచింగ్ టవర్స్‌ను సమర్థంగా వినియోగించుకుంటాం.
 
 ట్రాఫిక్ గైడ్‌గా మొబైల్ అప్లికేషన్
ఈ సారి అమలు చేయబోతున్న వన్‌వే పద్ధతి వల్ల భక్తులకు ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు వివరాలు అందించేలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో పనిచేసే విధంగా వెల్‌కమ్ టూ మేడారం పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించాం. ట్రాఫిక్ వివరాలతో పాటు జాతర షెడ్యుల్, అత్యవసర ఫోన్‌నంబర్ల వివరాలు ఈ అప్లికేషన్‌లో పొందుపరిచాం. రాష్ట్రం నలుమూలల నుంచి మేడారం వచ్చే దారుల వివరాలు ఉన్నాయి. అదేవిధంగా మేడారం నుంచి తిరుగు ప్రయాణానికి సంబంధించిన దారుల వివరాలు అప్లికేషన్‌లో అందుబాటులో ఉంచాం. మొబైల్‌ఫోన్‌లో ఉండే గ్లోబర్ పోజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)తో అనుసంధానం చేస్తే దారి మొత్తాన్ని ఎప్పటికప్పుడు మొబైల్‌ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు.
 
హన్మకొండ నుంచి వెళ్లే ప్రైవేట్ వాహనాలు పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవచ్చు. తిరుగు ప్రయూణంలో
 నార్లాపూర్, బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు పస్రా నుంచి తాడ్వారుు మీదుగా మేడారం చేరుకుంటారుు. తిరుగు ప్రయూణంలోనూ
 అదే రూట్‌లో వస్తారుు.
 
నోటిఫికేషన్‌తో మేలు
ఈ అప్లికేషన్‌లో ఉన్న నోటిఫికేషన్ ఆప్షన్ ద్వారా మేడారం జాతర రాకపోకల్లో ట్రాఫిక్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మార్గమధ్యంలో ఎక్కడైనా ట్రాఫిక జామ్ అయితే ప్రత్యామ్నయ దారి వివరాలను, రూట్‌ను ఈ అప్లికేషన్ చూపిస్తుంది. ఫలితంగా నిరీక్షణ ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా మేడారం వచ్చే దారిలో ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. గద్దెల ప్రాంగణం చుట్టూ సగటున ఐదు కిలోమీటర్ల పరిధిలో భక్తులు విడిది చేస్తారు. జాతరకు వచ్చిన భక్తులు తమ వాహనాలను నిలిపి ఉంచిన చోటును సేవ్ లొకేషన్ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల జాతర నుంచి తిరిగి వెళ్లేప్పుడు వాహనం ఎక్కడ పార్క్ చేశారనే అంశాన్ని తెలుసుకునే వెసులుబాటు ఉంది.

సోషల్ మీడియాలో  యానిమేషన్
మేడారం జాతర విశిష్టతతో పాటు మేడారం రాకపోకలకు సంబంధించి వరంగల్ రూరల్ పోలీసులు పది నిమిషాల నిడివిగల యానిమేషన్ మూవీని రూపొందించారు. యూట్యూబ్, వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో ఈ యానిమేషన్ మూవీ అందుబాటులో ఉంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా జాతర రూట్‌మ్యాప్ వివరాలు తెలుసుకోవచ్చు.
 
 
కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు కాటారం, భూపాలపల్లి, గాంధీనగర్ క్రాస్, జంగాలపల్లి క్రాస్ మీదుగా పస్రా, నార్లాపూర్ నుంచి మేడారం వెళ్లాలి. తిరుగు ప్రయూణంలో నార్లాపూర్, బయ్యక్కపేట,  కమలాపూర్ క్రాస్ నుంచి కాటారం మీదుగా వెళ్లిపోవచ్చు. ఆర్టీసీ బస్సులు కాటారం, భూపాలపల్లి, గాంధీనగర్ క్రాస్, జంగాలపల్లి క్రాస్ మీదుగా పస్రా, తాడ్వారుు నుంచి మేడారం వెళ్తారుు. తిరుగు ప్రయూణంలోనూ ఇదే రూట్‌లో వెళ్తారుు.
 

మరిన్ని వార్తలు