19 Dec, 2018 01:23 IST|Sakshi

సూర్యాపేట: సీపీఎం సీనియర్‌ నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు సతీమణి, ‘సాక్షి’ఎడిటర్‌ వర్ధెల్లి మురళి మాతృమూర్తి వర్ధెల్లి లక్ష్మమ్మ (78) గుండెపోటుతో మరణించారు. సూర్యాపేటలోని వారి నివాసంలో మంగళవారం మధ్యా హ్నం 1.30 గంటలకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించే లోపే ఆమె తుదిశ్వాస విడిచారు. వీరి స్వగ్రామం తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం కాగా సూర్యాపేటలోని విద్యానగర్‌లో నివాసముంటున్నారు. వర్ధెల్లి బుచ్చిరాములు, లక్ష్మమ్మ దంపతులకు కుమారుడు మురళితో పాటు కుమార్తె పద్మ ఉన్నారు. విషయం తెలుసుకున్న సాక్షి ఎడిటర్‌ మురళి సూర్యాపేటకు చేరుకుని మాతృమూర్తి భౌతికకాయం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ ఇంటిపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మమ్మ మరణంపై ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వేర్వేరుగా ప్రకటనల్లో తమ సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని సీపీఎం నాయకులు సందర్శించి నివాళులర్పించారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు బుధ వారం సూర్యాపేటలో జరుగుతాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు