సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ కేటగిరీ–2 విజేతలు వీరే

12 Mar, 2018 02:50 IST|Sakshi

హైదరాబాద్‌ : ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ–2017 (కేటగిరీ–2, తెలంగాణ రాష్ట్రం) విజే తలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఉ త్కంఠగా కొనసాగాయి. ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేత లు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ భాషపై, మ్యాథ్స్‌లో అంతర్గత భయాలు పోగొట్టి, నైపుణ్యాన్ని వెలికి తీయడం తో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పోటీలు కలిగించాయని వారు చెప్పారు.

స్పెల్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, కొండాపూర్‌ స్కూల్‌లో చదువుతున్న అర్నవ్‌ కౌల్‌ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.

మ్యాథ్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, కొండాపూర్‌ స్కూల్‌లో చదువుతున్న శ్రేయ కల్లూరి కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.

స్పెల్‌బీ ద్వితీయ బహుమతి:  హైదరాబాద్‌లోని చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, కొండాపూర్‌ స్కూల్‌లో చదువుతున్న ఆరవ్‌ శెట్టి కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.

మ్యాథ్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని గీతాంజలి దేవశాల స్కూల్‌లో చదువుతున్న మయూక్‌ జయసింహా కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.

స్పెల్‌బీ తృతీయ బహుమతి: మిర్యాలగూడలోని వర్డ్‌ – డీడ్‌ ప్రైమరీ స్కూల్‌లో చదువుతున్న డి. జయసూర్య మురారి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

మ్యాథ్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని సెయింట్‌ థెరిసా హై స్కూల్‌లో చదువుతున్న ఎస్‌. నిధి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకం, రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

మరిన్ని వార్తలు