కొలువిచ్చారు సరే.. జీతాలు మరీ..?

21 Jul, 2019 07:24 IST|Sakshi

మూడు నెలలుగా అవస్థలు పడుతున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు

సాక్షి, నేలకొండపల్లి: మూడునెలలుగా జీతం రాక కొత్తగా కొలువులో చేరిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు అవస్థలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 422 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు ఏప్రిల్‌ 12న విధుల్లో చేరారు. వారు విధుల్లో చేరి మూడునెలలు దాటింది. అయినా ఇంకా ఒక్కసారి కూడా జీతం పొందలేదు. ఎప్పుడు వస్తోందో అన్నసమాచారం కూడా లేదు. దీంతో వారి రోజు వారి ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోంది. 

రవాణా, కార్యాలయ నిర్వహణ.. 
ప్రతీ రోజు 10 నుంచి 20కిలో మీటర్ల నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వెళ్లాలంటే రవాణా ఖర్చు, దానికి అదనంగా పంచాయతీ కార్యాలయానికి అవసరమైన స్టేషనరీ ఖర్చులను కూడా పంచాయతీ కార్యదర్శులే భరించాలి. ప్రభుత్వ కొలువొచ్చిందని సంబరపడ్డ యువకులకు ఈ ఉద్యోగం కొత్త ఆర్థికకష్టాలను తెచ్చిపెట్టింది. ప్రభుత్వం వెంటనే జీతాలు విడుదల చేయాలని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.

గ్రాంట్‌ విడుదలైంది.. 
జిల్లాలో పనిచేస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల వేతనాలకు సంబంధించిన గ్రాంటు ప్రభు త్వం విడుదల చేసింది. ఎంపీడీఓల ద్వారా వారికి వేతనాలు అందించే ఏర్పాట్లు చేశాం. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. 
– సుధీర్‌కుమార్, ఏఓ, జిల్లా పంచాయతీ కార్యాలయం 

మరిన్ని వార్తలు