సమత కేసు : లాయర్‌ను నియమించిన కోర్టు

17 Dec, 2019 17:32 IST|Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌ : సమత అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన విచారణ ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమత కేసులో ప్రధాన నిందితుడైన షేక్ బాబు సహా  షేక్‌ శాబొద్దీన్‌, షేక్‌ ముఖ్దూమ్‌లను పోలీసులు రెండోరోజైన మంగళవారం ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సమత కేసును విచారించిన కోర్టు రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సమత కేసులో బార్‌ అసోసియేషన్‌ నిర్ణయంతో నిందితుల తరపున వాదించడానికి లాయర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో రహీమ్‌ అనే అడ్వకేట్‌ను నియమించినట్లు కోర్టు పేర్కొంది. నిందితుల తరపున వాదించడానికి తాను సిద్ధమేనని, ఈ మేరకు బార్‌ అసోసియేషన్‌ అనుమతి కోరనున్నట్లు రహీమ్‌ తెలిపారు. 
(చదవండి : సమత కేసు: రెండోరోజు కోర్టుకు నిందితులు)

మరిన్ని వార్తలు