సామ్రాజ్యమ్మ @103 ఏళ్లు

7 Oct, 2019 17:14 IST|Sakshi

సంగెం : వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం గుంటూరుపల్లికి చెందిన కొరిటాల సామ్రాజ్యమ్మ ఆదివారం 103వ జన్మదిన వేడుకలను జరపుకుంది. సామ్రాజ్యమ్మ భర్త రామకిష్టయ్య వంద ఏళ్లు జీవించి నాలుగేళ్ల క్రితం మరణించారు. 103 సంవత్సరాల వయసు ఉన్నా సామ్రాజ్యమ్మ నేటికీ తన పనులన్నీ స్వయంగా చేసుకోవడంతో పాటు వంట కూడా చేసుకుంటుంది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తెలు ఉండగా.. మొత్తం 50 మంది మనమలు, మనమరాళ్లు, ముని మనమలు, మనమరాళ్లు ఉన్నారు. పెద్ద కుమారుడు రామారావు, ముగ్గురు కుమార్తెలు చనిపోయారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా