ప్రభుత్వ ఖజానాకు తూట్లు

30 Aug, 2018 14:04 IST|Sakshi
చిన్నగూడూరులోని సీజ్‌ చేసిన ఇసుక డంపులు

    సీజ్‌ చేసిన 
    ఇసుకరాçశులు మాయం
     రాత్రికి రాత్రే ట్రక్కులతో 
    ఇసుక తరలింపు
     ఉదాసీనగా వ్యవహరిస్తున్న
    రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగంమరిపెడ రూరల్‌: చిన్నగూడూరు మండల కేంద్రంలోని సీజ్‌ చేసిన ఇసుక రాత్రికి రాత్రే మాయమవుతుంది. అధికారుల కళ్లు కప్పి సీజ్‌ చేసిన ఇసుకను కొందరు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అదే విధంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్‌ వ్యక్తులు రహస్యంగా ఇసుక డంపులు నిల్వ చేసి రాత్రి వేళల్లో పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడి రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం ఉదాసీనతగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చిన్నగూడూరు మండల కేంద్రం శివారులో ఆకేరు వాగులోని ఇసుకపై కన్నేసిన కొందరు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా గ్రామంలోనే పలు రహస్య ప్రాంతాల్లో ఇసుక డప్పులను నిల్వ చేస్తారు. మరికొందరు ట్రాక్టర్ల ద్వారా పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటారు. 
ఇసుక డంప్‌లు సీజ్‌..
చిన్నగూడూరు మండల కేంద్రంలో వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ చేసిన డంపులున్నట్లు సమాచారం తెలుసుకున్న చిన్నగూడూరు రెవెన్యూ అధికారులు రెండు నెలల క్రితం దాడులు నిర్వహించి సుమారు 14 ఇసుక డంపులను సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన ఇసుక రాసుల నిఘా వైఫల్యం చెందడంతో వాటిపై కొందరు కన్నెశారు. అదును చూసి ఇసుక రాసుల్లో నుంచి ట్రాక్కుల ద్వారా రాత్రికి రాత్రే తరలిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఆకేరు సమీపంలోని రహాస్య ప్రదేశాల్లో మరిన్ని పెద్ద పెద్ద ఇసుక రాశులు ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో ఈ ఇసుక డంపుల నుంచి పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
మరికొందరు గృహాలు నిర్మించుకుంటున్నామని చెబుతూ దర్జాగా ఇంటి ముందే ఇసుక డంప్‌ నిల్వలు చేసుకొని అమ్ముకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ట్రక్కు ఇసుక రూ.4 వేలు ఉండటంతో ఇసుక అక్రమార్కుల సంపాదన మూడు పువ్వులు ఆరుకాయల చందంగా వారి వ్యాపారం కొనసాగుతుంది. ఈ తతాంగం అంతా కూడా కొందరి అధికారుల కనుసైగల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీజ్‌ చేసిన ఇసుక డంప్‌ల నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ అధికారులు ఇటీవల పట్టుకున్నారు. ప్రభుత్వ ఇసుక తరలిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే జరిమానా వేసి వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
అడుగంటుతున్న భూగర్భజలాలు..
ఆకేరు వాగు నుంచి తోడుతున్న ఇసుక కారణంగా ఆ ప్రాంతంలోని భూగర్భజలాలు అడుగంటుకుపోయి వ్యవసాయానికి ఇబ్బందికరంగా మారుతోంది. వేసవిలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చిన్నగూడూరు ఇసుక మాఫియాపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.సీజ్‌ చేసిన ఇసుకను తరలిస్తూ పట్టుబడిన ట్రాక్టర్‌  

మరిన్ని వార్తలు