ఇసుక లారీల సీజ్ : రూ. 8లక్షల జరిమానా

25 Nov, 2014 23:27 IST|Sakshi

పటాన్‌చెరు రూరల్ : మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 21 లారీలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు. వాటికి రూ.8 లక్షల జరిమానాను విధించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ నిజామాబాద్ మెదక్ రేంజ్ డీఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ అక్ర మంగా ఇసుకను తయారు చేసి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. దీంతో 19 ఇసుక లారీలను సీజ్ చేశామన్నారు. రెండు ధాన్యం లారీలను కూడా సీజ్ చేసి అన్ని లారీలకు రూ.8 లక్షల జరిమానా విధించామని తెలిపారు.

 అక్రమంగా ఏ వ్యాపారం చేసిన అలాంటి వాటిపై దాడులు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక లారీలు తిరిగి అక్రమంగా రవాణా చేస్తే జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ వాహనాల తనిఖీలో సీఐలు జాన్ విక్టర్, శ్రీనివాస్‌రావు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు రఘునాథ్‌బాబు, సంతోష్‌కుమార్, వ్యవసాయశాఖ అధికారి విద్యాకర్‌రెడ్డి, అసిస్టెంట్ రిజిస్టార్ రమేష్‌కుమార్, అటవీశాఖ అధికారి రాఘవేందర్ రావు, విజిలెన్స్ ఎస్‌ఐ సదాత్‌మియ్యా, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు