‘కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి’

28 May, 2017 14:10 IST|Sakshi
‘కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి’

విశాఖపట్నం‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేయించిన సర్వే అంతా బూటకమని టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య అన్నారు. విశాఖ నగరంలో జరుగుతున్న మహానాడులో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు దమ్ముంటే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్లాలి. వెంటనే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరాలి.. అప్పుడు తెలుస్తుంది ఎవరి దమ్మెంతో. కేసీఆర్‌ వెల్లడించిన సర్వే వివరాలన్ని అబద్ధాలని అన్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు