ఏసీబీ కోర్టుకు హాజరైన సండ్ర

21 Jul, 2015 11:13 IST|Sakshi

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గోదావరి పుష్కరాలకు హాజరయ్యేందుకు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో భాగంగా మంగళవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన సండ్ర వెంకట వీరయ్యకు గత వారం షరతులతో కూడిన బెయిల్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు మంజూరు చేసింది.

 

ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని ,  నియోజకవర్గం వదిలి వెళ్లకూడదని కోర్టు షరతులు విధించింది.కాగా, పుష్కరాలకు హాజరు కావడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల సండ్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్ పై తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు