ప్రభుత్వ ఆస్పత్రిలో పార్కింగ్‌ దోపిడీ

30 Aug, 2019 10:11 IST|Sakshi
ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్‌ చేసిన వాహనాలు

జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వాకం

పైసలిస్తేనే ఆస్పత్రి లోపలికి వాహనాల ఎంట్రీ

రూ.5కు బదులు.. తీసుకుంటున్నది రూ.10

బండి లోపల పెట్టాలంటేనే జంకుతున్న రోగులు,సహాయకులు

చోద్యం చూస్తున్న అధికారులు

సాక్షి, సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో నిత్యం వందలాది మంది రోగులు, వారి సహాయకులు వస్తూపోతుంటారు. వైద్యం కోసం వీరు సొంత, ప్రైవేటు, అద్దె వాహనాల్లో వస్తారు. జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న వారిలో దాదాపుగా అధికశాతం పేదలే ఉంటారు. ఇక్కడ అన్ని సేవలు ఉచితంగానే అందాలి. కానీ పార్కింగ్‌ పేరుతో నిర్ణయించిన రేటుకంటే అధికంగా వసూలు చేస్తూ రోగులను, వారి సహాయకులను, పరామర్శించడానికి వచ్చిన వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ తతంగమంతా నెలలకొద్దీ జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  

పూర్తి వివరాలలోకి వెళ్తే.. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి జిల్లాలోని నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వారి వెంట సహాయకులు, కుటుంబసభ్యులు, పరామర్శించడానికి నిత్యం వందలాది మంది వచ్చి వెళ్తుంటారు. వీరిలో ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవారితో పాటుగా రోగులను తీసుకొని వాహనాలలో కూడా వస్తుంటారు. వాస్తవానికి వీరి వాహనాలను ఉచితంగా ఆస్పత్రి లోపలికి అనుమతించాలి. కానీ పార్కింగ్‌ పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తూ దండుకుంటున్నారు.

వాహనాల పార్కింగ్‌ నిమిత్తం టెండరును కూడా వేశారు. రెండు సంవత్సరాల క్రితం టెండరును ఖరారు చేశారు. ఈ కాలపరిమితిలో ప్రతినెలా రూ.12 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి వాహనానికి కేవలం రూ.5 మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. కాగా ఈ నిబంధనలను కాలరాస్తూ రూ.10 దండుకుంటున్నారు. వాస్తవానికి వాహనం పార్కింగ్‌కు ఇచ్చే రశీదుపై మాత్రం కేవలం రూ.5 మాత్రమే అని ముద్రించి ఉంటుంది. అయినప్పటికీ టెండరు కాంట్రాక్టుదారులు వాహనానికి రూ.10 వసూలు చేస్తూ రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ తతంగం గురించి పలుమార్లు రోగులు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో రోగులు ఫిర్యాదుచేసినా ఫలితంలేదని భావించి ఊరుకున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో మెయింటెనెన్స్‌ కోసం టెండరు వేస్తున్నప్పటికీ ఒకరి పేరుమీద మరొకరు పార్కింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పార్కింగ్‌ వసూలు చేస్తున్నవారిని వివరణ కోరగా.. కొన్ని సార్లు చిల్లర లేనప్పుడు మాత్రమే రూ.10 తీసుకుంటున్నట్లు చెప్పడం కొసమెరుపు.

ప్రతిరోజు వందల వాహనాలు..
జిల్లా ఆస్పత్రి కావడంతో రోగులు, సహాయకులు, బంధువులు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. వాహనాలు ప్రతి రోజు సుమారుగా 200 నుంచి 300 వరకు వస్తుంటాయి. వీటిలో దిచక్రవాహనాలు, ఆటోలు, కార్లు వస్తుంటాయి. ద్విచక్రవాహనాలకు రూ.5, ఆటో, కార్లు, తదితర వాహనాలకు రూ.10 తీసుకోవాలన్న నిబంధన ఉంది. కాగా ద్విచక్ర వాహనాలకు సైతం రూ.10 వసూలు చేస్తూ దండుకుంటున్నారని రోగులు పేర్కొంటున్నారు. ఆసుపత్రి రోగులను తరలించే అంబులెన్స్‌లకు సైతం రూ.10 వసూలు దోపిడీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాజీ సైనికులకు అమెజాన్‌లో ఉద్యోగాలు

గురుకులంలో టెన్షన్‌ టెన్షన్‌..

40 ఏళ్లుగా 'ఆ' గ్రామంలో ఒకే గణేశుడు

'గుట్ట'కాయ స్వాహా!

క్షణం ఆలస్యమైనా.. శవమయ్యేవాడే!

ఇష్టారాజ్యంగా కెమికల్‌ వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలు

ఆపరేషన్‌ అనంతగిరి..!

ఎంత ముందుచూపో!

క్రస్ట్‌గేట్ల ద్వారా లీకేజీలు!

‘భవిత’కు భరోసా ఏదీ?

అన్నదాతకు ‘క్రెడిట్‌’ 

అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు 

మంత్రి పదవి భిక్ష కాదు

ఫేస్‌బుక్‌ మర్డర్‌

రైతుల కోసం ఎంతైనా వెచ్చిస్తాం! 

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇపుడొక లెక్క!

విద్యార్థులు చెడు దారిలో వెళ్లడానికి వారే కారణం

మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

40 శాతం మందికి రైతు బంధు అందలేదు

హైటెక్స్‌లో అక్వా ఎగ్జిబిషన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఇది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది’

కలకలం రేపుతున్న శ్రీ హర్షిణి హత్య

గడ్కరీని కలిసిన టీఆర్‌ఎస్‌ నేతలు

‘అందుకే కేంద్రానికి డీపీఆర్‌లు ఇవ్వడం లేదు’

జొమాటో, స్విగ్గీల్లో..ఇలా ‘వేటే’శారు..

ఈ పార్కులో వారికి నో ఎంట్రీ

తకదిం'థీమ్‌'

మేకలకు ఫైన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మెగాస్టార్‌ను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై