అలివేలు.. ఆణిముత్యమా!

29 Apr, 2020 02:34 IST|Sakshi
కేటీఆర్‌కు చెక్కు అందజేస్తున్న అలివేలు

నెల వేతనం నుంచి రూ.10 వేలు విరాళం

మంత్రి కేటీఆర్‌కు చెక్కును ఇచ్చిన పారిశుధ్య కార్మికురాలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సాయంగా పలు వ్యక్తులు, సంస్థలు తమవంతుగా విరాళాలు అందజేస్తున్నాయి. అయితే జీహెచ్‌ఎంసీలో రూ.12వేల వేతనం పొందుతున్న పారిశుధ్య కార్మికురాలు అలివేలు రూ.10వేలు విరాళంగా ఇవ్వడం ద్వారా పెద్దమనసు చాటుకున్నారు. జియాగూడకు చెందిన పారిశుధ్య కార్మికురాలు అలివేలు జీహెచ్‌ఎంసీలో ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. కరోనాతో ప్రజలు పడుతున్న కష్టాలకు చలించి తన వేతనంలో నుంచి మంగళవారం రూ.10 వేలను చెక్కు రూపంలో మంత్రి కేటీ రామారావుకు అందజేశారు. 

కష్ట కాలంలో ఉపయోగపడాలనే..!
ఈ సందర్భంగా కేటీఆర్‌ అలివేలుతో మాట్లాడి ఆమెకుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. తన భర్త శ్రీశైలం కూరగాయల మార్కెట్‌లో రోజువారీ కూలీ అని, పిల్లలు చ దువుకుంటున్నారని అలివేలు చెప్పారు. కుటుంబానికి అం డగా ఉంటా, ఏదైనా సాయం కావాలంటే చెప్పమని కేటీఆర్‌ అడగ్గా.. ‘లాభాపేక్ష, ప్రయోజనం కోసం ఈ సాయం చే యడం లేదు. నెల వేతనం విరాళం ఇస్తానంటే చాలా మంది ఈ కష్టకాలంలో ఎందుకు నీ దగ్గరే పెట్టుకో అన్నారు. కానీ నా భర్త శ్రీశైలం, పిల్లలు శివప్రసాద్, వందన మాత్రం అండగా నిలిచారు’ అని అలివేలు సమాధానం ఇచ్చారు. ఆమె పెద్ద మనసుకు కేటీఆర్‌ అభినందనలు తెలుపుతూ ఆ విరాళం కరోనా పోరులో ముందు వరుసలో నిలిచిన ప్రతీ ఒక్కరికి గౌరవాన్ని ఇస్తుందని వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు