గురుకులాల భవనాలకు శానిటైజేషన్‌..!

22 May, 2020 04:20 IST|Sakshi

క్వారంటైన్‌ కేంద్రాలుగా ఉండి ఖాళీ చేసినవి తొలుత శుద్ధీకరణ

ఆ తర్వాత విడతల వారీగా అన్ని పాఠశాలల భవనాలు కూడా

పాఠశాలలు తెరిచే నాటికి కరోనా జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థలను శాని టైజ్‌ చేయాలని సొసైటీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులతో మెజార్టీ రంగాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈక్రమంలో అతి త్వరలో విద్యా సంస్థల నిర్వహణకు సైతం ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వనున్న నేపథ్యంలో ఆ దిశగా సొసైటీ యాజమాన్యాలు చర్యలు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా గురుకుల పాఠశాలలను క్రమ పద్ధతిలో శానిటైజేషన్‌ చేయనున్నాయి. కోవిడ్‌–19 అనుమానితుల కోసం చాలా గురుకుల పాఠశాలల భవనాలను క్వారంటైన్‌ సెం టర్లుగా ప్రభుత్వం వినియోగించింది. ఆ భవనాలను శానిటైజేషన్‌ చేయనున్నారు. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ మొదలు పె ట్టనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సూచించడం తో అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. త్వరలో క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభిస్తారు.

పాఠశాలలు తెరిచే నాటికి..: ప్రస్తుతం క్వారంటై న్‌ కేంద్రాలుగా ఉన్న వాటిని శానిటైజేషన్‌ చేసేందు కు కార్యాచరణ సిద్ధం చేస్తున్న సొసైటీలు... ఆ త ర్వాత మిగతా గురుకుల పాఠశాలల భవనాలను కూడా శుద్ధి చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 900కు పైగా గురుకుల పాఠశాల భవనాలున్నాయి. వీటి శానిటైజేషన్‌కు స్థానిక యంత్రాంగం సహకారం తీసుకో నున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ పరిధిలో ఉన్న గురుకుల పాఠశాల భవనాల ను అక్కడి యంత్రాంగం సహకారంతో శుద్ధిచేయాలని భావిస్తున్నారు.

ఆయా ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారం కోసం సంప్రదించాలని ఆయా గురుకుల పా ఠశాలల ప్రిన్సిపాళ్లకు సొసైటీ అధికారులు సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌ 4.0 ఈనెలాఖ రుతో ముగుస్తుంది. ఆ తర్వాత పొడిగిం పుపై సందేహం ఉన్నప్పటికీ జూన్‌ నెలాఖరు వరకు మాత్రం విద్యాసంస్థలకు అనుమతిచ్చే అవకాశం లేదని సమాచారం. టెన్త్‌ పరీక్షలు ముగిశాక జూలై చివర్లో లేదా ఆగస్టులో విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉంది. దీంతో ఆలోపు గురుకుల పాఠశాల భవనాలను శానిటైజేషన్‌ చేయనున్నారు.

మరిన్ని వార్తలు