సంజయ్‌కు ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్‌

20 Aug, 2018 17:46 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : నర్సింగ్‌ విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో నిజామాబాద్‌ మాజీ మేయర్‌ డి సంజయ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంజయ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ నిజామాబాద్‌ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్‌ను ఈ నెల 12న అరెస్టు చేసి, జిల్లా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు కృపాకర్‌రెడ్డి, ఆకుల రమేశ్‌.. ఈ నెల 14న ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ కేసులో వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. సంజయ్‌ విచారణ ఇంకా పూర్తి కాలేదని కోర్టుకు తెలిపారు. అతని విచారణకు మరింత సమయం పడుతుందన్నారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సంజయ్‌కు 13 రోజుల రిమాండ్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భక్తజనం లేకుండానే రాములోరి కల్యాణం

చెట్లెంట.. పుట్లెంట..!

నల్లగొండలో 17 మంది బర్మా దేశీయులు

కల్యాణ వేళాయె..

కరోనా :అపోహలూ... వాస్తవాలు

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా