సరళాసాగర్‌ ప్రాజెక్టుకు భారీ గండి

31 Dec, 2019 11:14 IST|Sakshi

సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలం సమీపంలో ఉన్న సరళాసాగర్‌ ప్రాజెక్టుకు వదర నీరు పోటెత్తటంతో మంగళవారం గండిపడింది. దీంతో కరకట్ట తెగి నీరు వృధాగా పోయింది. కరకట్ట తెగడంతో వరద నీరు రోడ్డు మీదికి చేరింది. దీంతో కొత్తకోట-ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత సరళాసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వదర నీరు చేరింది. సరళాసాగర్‌ ప్రాజెక్టు ఆసియాలోనే మొట్టమొదటి సైఫన్‌ సిస్టమ్‌ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించి కొట్టుకుపోయిన ప్రాజెక్టు గండిని పూడ్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు