నేనో శిల్పిని మాత్రమే..

19 Mar, 2019 11:58 IST|Sakshi

మోదీ కృషితోనే సర్ధార్‌ పటేల్‌ విగ్రహ ఏర్పాటు

ప్రస్తుతం ముంబైలో శివాజీ విగ్రహం

సుప్రసిద్ధ శిల్పకారుడు, పద్మభూషణ్‌ రామ్‌సుతార్‌  

జూబ్లీహిల్స్‌: నదులన్నీ సముద్రంలో కలిసినట్లు చిత్రకారులు, కళాకారులను ఒక్కచోట చేర్చడంలో ఆర్ట్‌గ్యాలరీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని సుప్రసిద్ధ శిల్పకారుడు, గుజరాత్‌లో సర్ధార్‌ పటేల్‌ విగ్రహ శిల్పి, పద్మభూషణ్‌ రామ్‌సుతార్‌ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మూలగుండం ఆర్ట్‌ గ్యాలరీని ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అరేబియా సముద్రతీరం ముంబైలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు పనుల్లో తీరిక లేకుండా ఉన్నానని చెప్పారు. గుజరాత్‌లోని నర్మదానది తీరంలో సర్ధార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు, స్థలం ఎంపిక ప్రధాని మోదీ నిర్ణయమన్నారు. తాను కేవలం విగ్రహ శిల్పిని మాత్రమే అని అన్నారు. చిన్నప్పుడు తాను విగ్రహాలు చేస్తుండగా పలువురు చూసి మెచ్చుకోవడంతో తాను ఇదే వృత్తిని ఎంచుకున్నానని, ఇష్టంతోనే ఈ వయస్సులో కూడా చురుగ్గా పని చేస్తున్నట్లు చెప్పారు. గ్యాలరీలోని చిత్రాలను వీక్షించారు. గ్యాలరీ నిర్వాహకులు మూలగుండం శాంతి, కృష్ణ, ప్రముఖ చిత్రకారుడు జగదీష్‌మిట్టల్, చరిత్రకారుడు వేదకుమార్, మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ, పలువురు కళాప్రియులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు